Pooja Hegde : ప్చ్‌.. పూజా హెగ్డెకు ఎంత కష్టం వచ్చింది.. లగేజ్‌ మొత్తం పోయింది..!

May 21, 2022 12:57 PM

Pooja Hegde : బుట్టబొమ్మగా అల వైకుంఠపురములో మూవీతో అలరించిన పూజా హెగ్డె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె గతేడాది అనేక చిత్రాల్లో నటించగా.. అవన్నీ హిట్‌ అయ్యాయి. అయితే ఈ ఏడాది ఆమెకు కలసి రాలేదనే చెప్పాలి. ఈ ఏడాది విడుదలైన రాధే శ్యామ్‌, బీస్ట్‌, ఆచార్య మూవీలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈమెకు కెరీర్‌ ఆరంభంలో పడిన ఐరన్ లెగ్‌ అన్న ముద్ర మళ్లీ వచ్చేసింది. అయినప్పటికీ ఈమెకు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఇక పూజా హెగ్డె తాజాగా కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో మెరిసింది. ఆమె అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంచి మార్కులను కొట్టేసింది. అయితే వాస్తవానికి ఫిలిం ఫెస్టివల్‌ సందర్భంగా పూజా హెగ్డె పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఆమె తన దుస్తులను, మేకప్‌ సామగ్రిని కోల్పోయింది. అయినప్పటికీ ఎంతో కష్టపడి చక్కని డ్రెస్‌ ధరించి మేకప్‌ చేసుకుని తిరిగి ఫెస్టివల్‌లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది.

పూజా హెగ్డె కేన్స్‌ కు వెళ్లేటప్పుడే ఆమెను ఇండియాలోనే ఎయిర్‌ పోర్టు వద్ద ఆపేశారు. దీంతో రెండు బ్యాగుల్లో ఒక బ్యాగును ఇక్కడే వదిలి వెళ్లింది. అయితే ఆమె కేన్స్‌కు చేరుకున్న తరువాత లగేజ్‌ను పోగొట్టుకుంది. తాను ఫిలిం ఫెస్టివల్‌లో ధరించాలనుకున్న డ్రెస్‌తోపాటు మేకప్‌ సామగ్రి మొత్తం ఆ లగేజ్‌లోనే ఉంది. దీంతో పూజా హెగ్డె ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేన్స్‌లోనే షాపింగ్‌ చేసి ఒక డ్రెస్‌ను అప్పటికప్పుడు కొనుగోలు చేసింది. తరువాత తన సిబ్బంది సహాయంతో కష్టపడి మేకప్‌ సామగ్రిని తెప్పించుకుంది. ఆ తరువాత ఆమె రెడీ అయి ఫిలిం ఫెస్టివల్‌కు హాజరైంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏమాత్రం తేడా జరిగినా ఆమె అసలు ఫెస్టివల్‌లో పాల్గొనలేకపోయేది. కానీ ఎట్టకేలకు అంతా హ్యాపీగానే ముగిసింది. ఇక ఈ వివరాలను పూజా స్వయంగా వెల్లడించింది.

Pooja Hegde lost her luggage at Cannes
Pooja Hegde

ఫిలిం ఫెస్టివల్‌కు తాను వెళ్లి వచ్చే వరకు తాను, తన సిబ్బంది ఎవరూ నిద్రపోలేదని, ఆహారం కూడా తీసుకోలేదని.. అయితే ఫెస్టివల్‌కు వెళ్లి వచ్చాక అప్పటికి తన ఆందోళన తగ్గిందని.. తనకు అందరూ కాంప్లిమెంట్స్‌ ఇస్తుంటే తాను పడిన కష్టం అంతా మరిచిపోయానని.. పూజా హెగ్డె తెలియజేసింది. ఇక ఫెస్టివల్‌ నుంచి తిరిగి వచ్చాక తన సిబ్బందితో కలిసి తాను ఒక హోటల్‌లో మంచి డిన్నర్‌ చేశామని చెప్పింది. తనకు గతంలో ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని.. టైముకు అన్నీ లభించాయి కాబట్టే ఫెస్టివల్‌లో పాల్గొనగలిగానని.. లేదంటే తనకు ఇబ్బందిగా అనిపించేదని పూజా తెలిపింది. ఈ క్రమంలోనే పూజా పడ్డ కష్టానికి నెటిజన్లు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె త్వరలోనే మహేష్, త్రివిక్రమ్‌ సినిమాలో నటించనుంది. అలాగే పలు ఇతర ప్రాజెక్టులు కూడా ఈమె చేతిలో ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now