Pooja Hegde : పాపం.. పూజా హెగ్డెకి దారుణ‌మైన అవ‌మానం.. ఇలా చేశారేంటి..?

April 3, 2022 10:07 AM

Pooja Hegde : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డె ఒక‌రు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో వ‌రుస సినిమాలు చేస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ముకుంద‌ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మరింత దగ్గరైంది. ప్ర‌స్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన పూజా హెగ్డె గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవ‌ల అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక రాధే శ్యామ్ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించ‌గా.. ఈ సినిమా మాత్రం నిరాశ‌ను మిగిల్చింది.

Pooja Hegde fans are very angry for insulting her in Beast movie
Pooja Hegde

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన చిత్రం బీస్ట్‌. ఈ సినిమాలో పూజా హెగ్డె క‌థానాయిక‌గా న‌టించింది. ఈ సినిమాపై అమ్మడు భారీ హోప్స్ పెట్టుకుంది. ఏప్రిల్ 13న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైల‌ర్‌ని తాజాగా విడుద‌ల చేశారు. చెన్నైలోని ఓ మాల్ ని టెర్రరిస్ట్ లు హైజాక్ చేయగా.. ఆ తీవ్రవాదుల బారి నుంచి ప్రజలను రక్షించి తీసుకుని రావడానికి సోల్జర్ విజయ్ రాఘవన్ గా దళపతి రంగంలోకి దిగుతాడు. ఆ నేపథ్యంలో చోటుచేసుకునే యాక్షన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ సినిమాలో డైరెక్టర్ సెల్వరాఘవన్ – యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

అంతా బాగానే ఉంది కానీ ట్రైల‌ర్‌లో పూజాని మెరుపు తీగ‌లా చూపించారు. టాప్ హీరోయిన్‌గా ఉన్న పూజాకి క‌నీసం కొంత స్పేస్ ఇవ్వ‌క‌పోవ‌డం పట్ల అభిమానులు మండిప‌డుతున్నారు. దాదాపు 3 నిమిషాల వ్యవధి ఉన్న ఈ ట్రైలర్‌లో ఒకే ఒక్క షాట్, ఒకే ఒక్క సెకన్ పూజా హెగ్డె కనిపించ‌డంతో ఎంత దారుణం అని కామెంట్స్ చేస్తున్నారు. పేరుకే ఇందులో హీరోయిన్ ఉందని ఇట్టే చెప్పేసినట్లు అర్థమవుతోంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ఏ చిన్న అప్‌డేట్‌ అయినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. అంతలా విజయ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే ఈ సినిమానుంచి వచ్చిన అరబిక్ కుతు సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 255 మిలియన్ల‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అలాగే సెకండ్ సాంగ్ జాలియా జింఖానా కూడా భారీ వ్యూస్ ను సాధిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment