Pooja Hegde : అడిగిన వెంటనే అభిమానుల కోరిక తీర్చిన బుట్ట బొమ్మ..!

November 16, 2021 8:50 AM

Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం సినిమాలకి కాస్త విరామం ఇచ్చి హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే పూజా హెగ్డే మాల్దీవులకు వెళ్లి మాల్దీవుల అందాలను వీక్షిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తోంది. మాల్దీవులలోకి ఎంటరైన బుట్ట బొమ్మ అక్కడి నుంచి వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది.

Pooja Hegde enjoying in maldives photos viral

ఈ క్రమంలోనే పూజా హెగ్డే మాల్దీవులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఎంతో మంది నెటిజన్లు ఆమెను బికినీలో చూడాలంటూ కామెంట్ చేశారు. అయితే నెటిజన్లు వారి కోరికను ఆమె ముందు పెట్టారో లేదో వెంటనే బుట్ట బొమ్మ వారి కోరికను తీర్చింది. ఈ క్రమంలోనే ఆమె మాల్దీవులలో బికినీ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో పూజ హెగ్డే ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు వీటిని మరింత వైరల్ చేస్తున్నారు. పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే ఈమె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విజయాన్ని అందుకుంది. త్వరలోనే ప్రభాస్ సరసన నటించిన రాధే శ్యామ్ విడుదల కానుంది.

అదేవిధంగా ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన నీలాంబరి అనే పాత్రలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు పూర్తి కావడంతో ఈమె మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. మాల్దీవుల వెకేషన్ అనంతరం తిరిగి తాను కమిట్ అయిన సినిమాలతో పూజా హెగ్డే బిజీ కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment