Pooja Hegde : ఇదే త‌న డ్రీమ్ అన్న పూజా.. ఎట్ట‌కేల‌కు నెర‌వేరుతుంద‌ని కామెంట్‌..

October 28, 2021 9:41 AM

Pooja Hegde : పూజా హెగ్డే ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉంది. మోడ‌ల్‌గా త‌న కెరీర్‌ని మొదలు పెట్టింది పూజా. మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడే పూజా హెగ్డే దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే ‘మూగమూడి’ అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ‘ఒక లైలా కోసం’ అనే సినిమానూ చేసింది. ఇవి మాత్రం ఆమెకు సక్సెస్‌ను ఇవ్వలేదు. కానీ, క్రష్‌గా మారిపోయింది.

Pooja Hegde building her dream house in mumbai

అర‌వింద స‌మేత చిత్రం త‌ర్వాత పూజా స‌క్సెస్ రేటు మారింది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. ఇటీవ‌ల పూజా న‌టించిన‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రం విడుద‌ల కాగా, ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించింది. ఇక పూజా న‌టించిన రాధేశ్యామ్, ఆచార్య చిత్రాలు విడుద‌ల కానున్నాయి. ప్రస్తుతం హిందీలో సల్మాన్‌ ఖాన్‌ సరసన ‘భాయిజాన్‌’, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ చిత్రాలు చేస్తుంది పూజ. సౌత్‌లో మహేశ్‌ బాబు, ప్రభాస్, పవన్‌ కల్యాణ్, విజయ్‌ చిత్రాలకు ఇచ్చిన కమిట్‌మెంట్‌తో పూజా హెగ్డే డైరీ నిండుగా ఉంది.

https://www.instagram.com/p/CVhzw3NK-nb/?utm_source=ig_web_copy_link

పూజా హెగ్డేకి సొంత ఇల్లు క‌ల ఉండేద‌ట‌. అది తీర్చుకోబోతుంది. పూజా హెగ్డే కొత్తగా నిర్మిస్తున్న తన ఇంటి చిత్రాలను అభిమానులతో పంచుకుంది. పెయింటింగ్ పనులను పరిశీలిస్తున్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ” బిల్డింగ్ మై డ్రిమ్స్” అని క్యాప్షన్ పెట్టింది. ఈ ఇంటి పనులన్నీ ఆమె తల్లి చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment