Pawan Kalyan : భీమ్లా నాయక్ ఆలస్యంపై పవన్‌ అసహనం..?

October 29, 2021 11:48 PM

Pawan Kalyan : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో భీమ్లా నాయక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుందని తెలుస్తోంది.

Pawan Kalyan unsatisfied over the delay of bhimla nayak

అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేటాయించిన కాల్షీట్స్ పూర్తి అయినప్పటికీ ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో పవన్ కళ్యాణ్ సినిమా పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పై ఒక సన్నివేశం, రెండు పాటలను చిత్రీకరించాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన కాల్షీట్స్ అయిపోయాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అదనంగా డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇలా దర్శకుడు ఈ సినిమా పట్ల ఆలస్యం చేస్తుండటంతో పవన్ కళ్యాణ్ నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. మరొక వైపు ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల అనుకున్న ప్రకారం సినిమాలు పూర్తి చేస్తారా లేదా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now