Pawan Kalyan : పవన్‌ కల్యాణ్‌ ఒక్క సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా ?

March 18, 2022 8:37 PM

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస రిమేక్ చిత్రాలలో నటిస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇలా ఈ సినిమా విజయవంతం కావడంతో మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Pawan Kalyan remuneration for one movie
Pawan Kalyan

తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన వినోదయ సీతం సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తోపాటు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు గాను ఈ నెల 24వ తేదీ నుంచి షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా పనులను వేగవంతం చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 రోజుల పాటు తన కాల్షీట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ 20 రోజులకు పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే ప్రతి ఒక్కరూ ఎంతో ఆశ్చర్యపోతున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజులకే రూ.60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే రోజుకు మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు లెక్క. ఇక ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ZEE5తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment