Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్, ఆయన రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న పవన్ ప్రస్తుతం సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలపై కూడా దృష్టి సారిస్తున్నారు. పవన్ షూటింగ్స్ మరియు పాలిటిక్స్ లో ఖాళీ సమయం దొరికితే చాలు ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఎక్కువగా పుస్తకాలు చదువుతూ సినిమాలతో పాటు రాజకీయాలను కూడా చక్కగా బ్యాలన్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఏ విద్యను అభ్యసించారు అనే విషయం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
అసలు పవన్ కళ్యాణ్ ఏం చదువుకున్నాడు.. ఎంత వరకు ఈయన చదువు సాగింది.. ఇలా చాలా ప్రశ్నలు పవన్ ఎడ్యుకేషన్ మీద ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ భాషను చూసిన తర్వాత ఆయన చదువు గురించి ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం కూడా రాలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా అనర్ఘలంగా మాట్లాడగలడు.
ఇక పవన్ కళ్యాణ్ ఏం చదివారు అనే విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ కొణిదెల వెంకట్రావు, అంజనాదేవిలకు 1972 సెప్టెంబర్ 2న బాపట్లలో జన్మించాడు. పవన్ కళ్యాణ్ నాన్న పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా చేసేవారు. దీంతో తరచూ బదిలీలు జరిగేవి. ఇలా పవన్ విద్యాభాస్యం బాపట్లలో మొదలైంది. ఆ తర్వాత చీరాలలో కొనసాగింది. పవన్ తన ఇంటర్ మీడియట్ ను నెల్లూరులోని వీ.ఆర్.సీ కళాశాలలో పూర్తి చేశాడు. ఆ తర్వాత చదువుల మీద ఆసక్తి లేక డిగ్రీ చేయలేదు. అనంతరం కంప్యూటర్స్ లో డిప్లొమో చేసి చదువులకు శాశ్వతంగా స్వస్తి పలికాడు.
ఖాళీగా ఉన్న పవన్ అటు చదువుకోకుండా ఇటు ఎవ్వరితో కలువకుండా సైలెంట్ గా ఉండడం చూసి అన్న చిరంజీవి 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేయించాడు. మెగాస్టార్ సినీ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కూడా తన సొంత టాలెంట్ తో పవర్ స్టార్ గా, అభిమానులు మా ఆరాధ్య దైవం పవన్ అనే రేంజ్ ఎదిగాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…