Chiranjeevi : తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త నడక నేర్పిన నటులు ఎవరు అనే ప్రశ్న తలెత్తితే.. ఎవరైనా ఏమాత్రం తడుముకోకుండా మొదటిగా చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఆయన డైలాగ్ డెలివరీ, ట్రెండ్ సెట్ చేసిన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, ఇంకా చెప్పాలి అంటే ఆయన పరిచయం చేసిన డాన్స్ స్టైల్ తెలుగు సినీ ఇండస్ట్రీలో నూతన అధ్యయనాన్ని లిఖించాయి. 66 ఏళ్ల వయసులో కూడా కుర్రకారుకు జోష్ తెప్పించే ఎనర్జీతో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతూ యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీనిస్తున్నారు మెగాస్టార్.
చిరంజీవి తన కెరీర్ మొదలు నుంచి కూడా విభిన్నమైన కథలను ఎంపిక చేసుకునేవారు. మెగాస్టార్ తన సినీ కెరిర్ లో దాదాపు అన్ని రకాల పాత్రలను పోషించారు. అలా ఎన్నో వైవిద్య భరితమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి. అలా కథకు ప్రాధాన్యత ఇచ్చి చిరంజీవి హీరోగా నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం 1982 ఏప్రిల్ 23న వేసవి బరిలో దిగి ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ చిత్రంగాను కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా కోసం ముందుగా కోడి రామకృష్ణ ప్రముఖ నిర్మాత అయిన కె.రాఘవ వద్దకు వెళ్లారు. కోడి రామకృష్ణ ఊహించని విధంగా ఆయన స్పందించారు. మనకు చాలా మంచి స్టార్ హీరోలు ఉండగా చిరంజీవిని ఎందుకు ఈ సినిమాకు ఎంపిక చేసావు అని అడిగారట. అప్పుడు కోడి రామకృష్ణ ఇలా బదులు చెప్పారట. నా సినిమా లో కథకు తగ్గట్టుగా చిరంజీవి మాత్రమే బాగుంటారు అని సమాధానమిచ్చారట కోడి రామకృష్ణ.
మర్నాడు ప్రొడక్షన్ పెద్దలతో మీటింగ్ పెట్టి వారి మధ్య కోడి రామకృష్ణను నిలబెట్టి మరి నిలదీసి అడిగారట కె.రాఘవ. ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. నా సినిమాలో భార్య భర్తని అవమానిస్తుంది. బాగా నిలదీస్తుంది. ఆ పాత్రలో చిరంజీవి ఉంటేనే ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారు. కథ చాలా కొత్తగా ఉంటుంది అని కన్విన్స్ చేశారట కోడి రామకృష్ణ. దర్శకుడు సమాధానంతో ఈ మీటింగ్ తరువాత చిరంజీవి అయితేనే ఈ కథకు కరెక్ట్ గా సరిపోతాడు అని భావించి నిర్మాతలు ఒకే చెప్పారు. అలా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం తెరపైకి వచ్చి బ్లాక్ పాస్టర్ హిట్ గా నిలిచింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…