Chicken Soup : చలికాలం ఈ ఏడాది మరింత ఎక్కువగా ఉంది. ఇంకా డిసెంబర్ రాకముందే చలి చంపేస్తోంది. చలిని తట్టుకునేందుకు చాలా మంది అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. స్వెటర్లు, ఉన్ని దుస్తులు ధరించడం, వేడి పదార్థాలను తీసుకోవడం చేస్తున్నారు. అయితే చలికాలంలో మనం తీసుకునే ఆహారాల్లో కూడా పలు మార్పులు చేసుకోవాలి. దీంతో శరీరం వెచ్చగా ఉంటుంది. ఇక శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాల్లో చికెన్ సూప్ కూడా ఒకటి. దీన్ని చలికాలంలో ఎక్కువగా తీసుకోవాలి. దీంతో శరీరం వెచ్చగా ఉండడమే కాదు.. మనకు పోషకాలు, శక్తి రెండూ లభిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక చికెన్ సూప్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్‌లెస్ చికెన్ – పావు కిలో, పాలకూర తరుగు – ఒక కప్పు, క్యారెట్ తరుగు – పావు కప్పు, బీన్స్ తరుగు – పావు కప్పు, వెల్లుల్లి తరుగు – ఒక టీస్పూన్, పచ్చి మిర్చి తరుగు – ఒక టీస్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టీస్పూన్, నూనె – ఒక టీస్పూన్, ఉప్పు – తగినంత, పంచదార – ఒక టీస్పూన్, మిరియాల పొడి – చిటికెడు, టేస్టింగ్ సాల్ట్ – చిటికెడు, ఉల్లికాడల తరుగు – 2 టీస్పూన్లు.
చికెన్ సూప్‌ను తయారు చేసే విధానం..
ముందుగా ఒక పాత్రలో చికెన్ మునిగేలా నీళ్లు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక క్యారెట్, బీన్స్, వెల్లుల్లి, పచ్చి మిర్చి తరుగులను వేసి కొద్దిగా వేయించాలి. చికెన్‌ను, దాన్ని ఉడికించిన నీళ్లను, పంచదార, ఉప్పు, పాలకూర తరుగు, మిరియాల పొడి, టేస్టింగ్ సాల్ట్, కార్న్ ఫ్లోర్, ఉల్లికాడల తరుగు వరుసగా ఒకదాని తరువాత ఒకటి వేసి కొద్దిసేపు ఉడికించి దించేయాలి. దీంతో ఎంతో రుచికరమైన చికెన్ సూప్ రెడీ అవుతుంది. దీన్ని చిన్న బౌల్‌లోకి తీసుకుని అందులో పైన కాస్త కొత్తిమీర తరుగు వేసి అలంకరించి సర్వ్ చేయాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితేనే ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…