Pawan Kalyan : ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు చేదువార్త‌.. హ‌రిహ‌ర వీర మ‌ల్లు ఆగిపోయిందా..?

June 2, 2022 8:32 AM

Pawan Kalyan : క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం.. హ‌రిహ‌ర వీర మ‌ల్లు. ఈ మూవీ వాస్త‌వానికి షూటింగ్ ఎప్పుడో పూర్తి కావ‌ల్సి ఉంది. కానీ కోవిడ్ కార‌ణంగా 2 ఏళ్లు ఆల‌స్యంగా షూటింగ్ మొద‌లైంది. దీంతో బ‌డ్జెట్ ఇంకా పెరిగిపోయింది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ మ‌ళ్లీ ఇటీవ‌లే ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈమ‌ధ్యే ఈ మూవీలోంచి కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు చెందిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో ఫ్యాన్స్ సంబుర ప‌డ్డారు. కానీ వారి సంతోషం ఎక్కువ రోజుల పాటు నిల‌వ‌లేద‌ని తెలుస్తోంది. కార‌ణం.. ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మూవీ షూటింగ్ మొద‌లుకాక ముందే సినిమాలో క‌థ‌కు కొన్ని మార్పులు చేయాల‌ని ప‌వ‌న్ సూచించార‌ట‌. ద‌ర్శ‌కుడు క్రిష్‌కు ప‌వ‌న్ సూచ‌న‌లు చేశార‌ట‌. అయితే క్రిష్ కేవ‌లం కొన్ని కాస్ట్యూమ్ డిజైన్ మార్పులు మాత్ర‌మే చేశార‌ట‌. పెద్ద‌గా ఏమీ మార్చ‌లేద‌ట‌. దీంతో ప‌వ‌న్‌కు క్రిష్ ఇలా చేయ‌డం న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో తాను చెప్పిన సూచ‌న‌లు చేసే వ‌ర‌కు సినిమా షూటింగ్‌కు రావొద్ద‌ని ప‌వ‌న్ నిర్ణయించుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయిన‌ట్లు తెలుస్తోంది.

Pawan Kalyan Hai Hara Veera Mallu shooting reportedly stalled
Pawan Kalyan

అయితే ప‌వ‌న్ చేసిన సూచ‌న‌ల ప్ర‌కారం క‌థ‌లో మార్పులు చేసేందుకు ద‌ర్శ‌కుడు క్రిష్ ఏ కోశానా అంగీక‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది. క‌థ‌ను య‌థా ప్ర‌కారం సినిమాలా తీయాల‌ని క్రిష్ ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. దీంతో మూవీ షూటింగ్‌కు బ్రేక్ ప‌డింద‌ని అంటున్నారు. ఇక ఈ ప‌రిస్థితుల వ‌ల్ల ఎటొచ్చి నిర్మాత‌కే మ‌రింత క‌ష్టం పెరిగింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టికే 2 ఏళ్ల ఆల‌స్యంతో సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. ఖ‌ర్చు త‌డిసి మోపెడైంది. మ‌ళ్లీ మూవీ షూటింగ్ వాయిదా ప‌డితే ఇక నిర్మాత ఇంకా న‌ష్టాల్లోకి కూరుకుపోవ‌డం ఖాయం. మ‌రి ఈ విష‌యంలో ఎవ‌రు వెన‌క్కి త‌గ్గుతారో చూడాలి. ఏది ఏమైనా ఇది ప‌వ‌న్ ఫ్యాన్స్ చేదు వార్తే అని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment