Pawan Kalyan : ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. గత కొద్ది రోజులుగా ఆయన భీమ్లా నాయక్ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా నిత్య మీనన్ నటిస్తుండగా, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే అందిస్తోన్న విషయం తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ మూవీ విడుదల కానున్నట్టు తెలుస్తుంది.
భీమ్లా నాయక్ చిత్రం ఒక వైపు షూటింగ్ జరుపుకుంటూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటోంది. తాజాగా ఎడిటెడ్ ఫుటేజ్‌ని ప్రత్యేకంగా పరిశీలించారు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. డీఓపీ రవి.కె.చంద్రన్ పనితీరును మెచ్చుకుంటూ చేతిరాతతో అప్రిషియేషన్ లెటర్ రాసిచ్చారు. భీమ్లానాయక్ ప్రాజెక్ట్‌లో మీరు ఒక పార్ట్ కావడం సంతోషదాయకం… ఔట్‌పుట్‌లో మంచి డిఫరెన్స్ చూపించారు.. థ్యాంక్స్ అంటూ లెటర్ రాసి ఆయనకు ప్రత్యేకంగా బొకే కూడా అందించారు.
పవన్ కళ్యాణ్ స్వదస్తూరితో రాసి ఇచ్చిన లేఖను చూసి మురిసిపోయిన రవి కె చంద్రన్.. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తన కెమెరాతో ఎంతోమందిని స్టార్లను అందంగా చూపించి, ఎన్నో అద్భుత దృశ్యాల్ని వెండితెరపై ఆవిష్కరించి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్.. అంతర్జాతీయ స్థాయిలో ‘తమర’ అనే క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కించనున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…