Pawan Kalyan : చేతి రాత‌తో డీఓపీకి లెట‌ర్ రాసిన ప‌వన్ కళ్యాణ్‌.. ఎందుకంటారు?

November 13, 2021 8:12 AM

Pawan Kalyan : ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న భీమ్లా నాయ‌క్ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా నిత్య మీనన్‌ నటిస్తుండగా, రానా సరసన సంయుక్త మీనన్‌ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే అందిస్తోన్న విషయం తెలిసిందే. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. సంక్రాంతి బ‌రిలో ఈ మూవీ విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది.

Pawan Kalyan given written letter to dop know the reason

భీమ్లా నాయ‌క్ చిత్రం ఒక వైపు షూటింగ్ జ‌రుపుకుంటూనే మ‌రో వైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటూ ఉంటోంది. తాజాగా ఎడిటెడ్ ఫుటేజ్‌ని ప్రత్యేకంగా పరిశీలించారు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌. డీఓపీ రవి.కె.చంద్రన్‌ పనితీరును మెచ్చుకుంటూ చేతిరాతతో అప్రిషియేషన్ లెటర్ రాసిచ్చారు. భీమ్లానాయక్‌ ప్రాజెక్ట్‌లో మీరు ఒక పార్ట్ కావడం సంతోషదాయకం… ఔట్‌పుట్‌లో మంచి డిఫరెన్స్ చూపించారు.. థ్యాంక్స్ అంటూ లెటర్ రాసి ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా బొకే కూడా అందించారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌ద‌స్తూరితో రాసి ఇచ్చిన లేఖ‌ను చూసి మురిసిపోయిన ర‌వి కె చంద్ర‌న్.. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. తన కెమెరాతో ఎంతోమందిని స్టార్లను అందంగా చూపించి, ఎన్నో అద్భుత దృశ్యాల్ని వెండితెరపై ఆవిష్కరించి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినిమాటోగ్రాఫర్‌ రవి కె.చంద్రన్‌.. అంతర్జాతీయ స్థాయిలో ‘తమర’ అనే క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కించనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now