Swara Bhaskar : సోషల్ మీడియాలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కొందరు నెటిజన్స్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్స్ అని కూడా చూడకుండా వల్గర్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. హీరోయిన్స్ దృష్టిని ఆకర్షించేందుకు గాను కొందరు చేసే ప్రయత్నాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. అలాంటి సమయంలో చాలా మంది హీరోయిన్స్ అలాంటి నెగటివ్ కామెంట్స్ ను పట్టించుకోరు. కొందరు మాత్రం తెలివైన సమాధానాలు ఇస్తుంటారు.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్.. ఓ నెటిజన్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. వివరాలలోకి వెళితే.. ఒక నెటిజన్.. స్వర భాస్కర్ ఇటీవల షేర్ చేసిన ఫొటోకు.. చీరలో నీ కన్నా మా పనిమనిషి అందంగా ఉంటుంది.. ఆమె నీ కంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.. అంటూ కామెంట్ పెట్టాడు. చీర కట్టులో ఏమాత్రం బాగుండవు.. అంటూ స్వరా భాస్కర్ ను అతడు డైరెక్ట్ గా అంత మాట అనేశాడు.
నెటిజన్ మాటలకు మాములు వాళ్లయినా కోప్పడడం సహజం కానీ స్వర భాస్కర్ మాత్రం అతడికి హుందాగా బదులు ఇచ్చింది. మీరు అన్నట్లుగా మీ పని మనిషి చీరలో చాలా బాగుంటుందని నేను కూడా నమ్ముతున్నాను. ఆమె చేసే పనికి.. ఆమె మీకు ఇచ్చే సర్వీస్ కు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆమెతో మర్యాదగా వ్యవహరిస్తారని.. ఆమెతో అసభ్యంగా మాట్లాడుతూ, చులకనగా ఆమెను చూడరని ఆశిస్తున్నాను.. అంటూ ట్వీట్ కు రిప్లై ఇచ్చింది. స్వర భాస్కర్ కామెంట్స్‌పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన హాట్ ఫొటో షూట్ లను షేర్ చేసే స్వర భాస్కర్ ఇలాంటి కామెంట్స్ చాలా సార్లు ఫేస్ చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…