Pawan Kalyan : ప‌వ‌న్ కారు వెంట ప‌రుగెత్తిన అభిమాని.. వివ‌రాలు క‌నుక్కొని ప‌ల‌క‌రించిన ప‌వ‌ర్ స్టార్..

October 9, 2021 11:22 PM

Pawan Kalyan : సినీ ఇండస్ట్రీలో తమ ఫేవరెట్ స్టార్స్ కోసం ఏమైనా చేసే అభిమానులు చాలామందే ఉన్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా టాలీవుడ్ మెగా హీరో చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా ఓ అభిమాని తిరుపతి నుండి హైదరాబాద్ వరకు సైకిల్ పై వెళ్ళి మరీ కలిసిన సంగతి తెలిసిందే. అంతటి సాహసం చేసిన ఆ అభిమాని గురించి తెలుసుకున్న చిరంజీవి అతని గురించి ఎంక్వయిరీ చేశారు.

Pawan Kalyan fan chased pawan car and met him

అలా వచ్చిన ఆ అభిమాని చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ ని కూడా కలిసి హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్ళారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్ పై తనకున్న ప్రేమను తెలియజేసేందుకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ తో పాటు దాదాపుగా మూడు కిలోమీటర్ల దూరం ఓ అభిమాని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.

రాజమండ్రిలో కాన్వాయ్ తో పాటు మహేష్ అనే వ్యక్తి పరిగెడుతున్న వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న పవర్ స్టార్ తన అభిమానికి ఫోన్ చేసి మరీ కలిశారు. అలాగే తనతో కలిసి ఓ ఫోటోని తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి సంఘటనలు ఎప్పటికప్పుడు సినీ ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment