Pawan Kalyan : పవన్ ఆ పని చేస్తే.. నిర్మాతలకు కష్టమే..?

June 5, 2022 12:03 PM

Pawan Kalyan : పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల భీమ్లా నాయక్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఇక పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్‌లో ఉన్నారు. మరోవైపు ఏపీలో పలు వర్గాలకు చెందిన ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. కొంత కాలం తరువాత పవన్‌ పూర్తిగా తన సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తారని అంటున్నారు. దీంతో నిర్మాతల్లో భయం పట్టుకుంది.

ఇప్పటికే హరిహరవీరమల్లు పూర్తి కావల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కోవిడ్‌ కారణంగా ఈ మూవీని ఏకంగా 2 ఏళ్ల పాటు వాయిదా వేశారు. దీంతో రీసెంట్ గా మళ్లీ షూటింగ్‌ ప్రారంభమైంది. అయితే దర్శకుడు క్రిష్‌కు, పవన్‌కు మధ్య విభేదాలు వచ్చాయని, పవన్‌ చెప్పినట్లు దర్శకుడు క్రిష్‌ ఇందులో మార్పులు చేయలేదని.. కనుక ఆ మార్పులు చేసే వరకు హరిహరవీరమల్లు షూటింగ్‌కు రాలేనని.. పవన్‌ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ షూటింగ్‌ ఆగిపోయిందనే వార్తలు కూడా వస్తున్నాయి.

Pawan Kalyan decision is key to success or loss to producers
Pawan Kalyan

ఇక పవన్‌ చేయాల్సిన సినిమాల జాబితాలో.. భవదీయుడు భగత్‌ సింగ్‌, వినోదయ సీతమ్‌, సురేందర్‌ రెడ్డి సినిమా ఉన్నాయి. అయితే హరిహర వీరమల్లుకే దిక్కులేదు. ఈ మూవీ షూటింగ్‌ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మిగిలిన సినిమాల పరిస్థితి ఏమవుతుందోనని నిర్మాతలు టెన్షన్‌ పడుతున్నారట. ఎందుకంటే పవన్‌ ఒక్క సినిమా పూర్తయ్యే సరికే చాలా కాలం పడుతుంది. అప్పటి వరకు ఎన్నికలు వస్తాయి. కానీ కొన్ని రోజుల్లోనే పవన్‌ ఏపీ అంతటా పాదయాత్ర చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే నిజమైతే ఆయనకు సినిమాల్లో నటించేందుకు సమయం లభించదు. దీంతో అడ్వాన్స్‌ ఇచ్చి వేచి చూస్తున్న నిర్మాతలకు నష్టమే కలుగుతుంది. అయితే ఈ విషయంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పవన్‌ అడ్వాన్స్‌ తీసుకున్న సినిమాలన్నీ చకచకా పూర్తి చేసి తరువాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి కావల్సినన్ని రోజులు రాజకీయాల్లో ఉంటే బాగుంటుందని.. 2024 ఎన్నికల తరువాత వీలును బట్టి ఉంటే రాజకీయాలు లేదా మళ్లీ సినిమాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్‌ కోరుతున్నారు. అలా కాకుండా ఇప్పుడు పూర్తి చేయాల్సిన సినిమాలను అలాగే పెండింగ్‌లో పెడితే మాత్రం నిర్మాతలకు కోలుకోలేని దెబ్బ పడుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ విషయంలో పవన్‌ ఏం చేస్తారో చూడాలి. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment