గురువారం, జూన్ 11, 2026
lifestyle

Papaya Side Effects : బొప్పాయి పండ్ల‌ను ఇలా తింటే డేంజ‌ర్‌..!

Papaya Side Effects : మ‌న‌కు ఏడాది పొడ‌వునా ల‌భించే పండ్ల‌లో బొప్పాయి పండ్లు కూడా ఒక‌టి. ఇవి పెద్ద ధ‌ర కూడా ఉండ‌వు. కానీ వీటిని చాలా మంది తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. అయితే బొప్పాయి పండ్ల‌ను…

Papaya Side Effects : బొప్పాయి పండ్ల‌ను ఇలా తింటే డేంజ‌ర్‌..!

Papaya Side Effects : మ‌న‌కు ఏడాది పొడ‌వునా ల‌భించే పండ్ల‌లో బొప్పాయి పండ్లు కూడా ఒక‌టి. ఇవి పెద్ద ధ‌ర కూడా ఉండ‌వు. కానీ వీటిని చాలా మంది తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. అయితే బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటితో జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి, కంటి చూపు మెరుగుప‌డుతుంది. అయితే బొప్పాయి పండ్ల‌ను అధికంగా తిన్నా లేదా ఇత‌ర ప‌దార్థాల‌తో క‌లిపి తిన్నా ఇబ్బందులు ఎదుర‌వుతాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

బొప్పాయి పండ్ల‌ను అధికంగా తిన్నా లేదా ఇత‌ర ప‌దార్థాల‌తో క‌లిపి తిన్నా జీర్ణ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ముఖ్యంగా విరేచ‌నాలు అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక ఈ పండ్ల‌ను అధికంగా సేవించ‌రాదు. అలాగే ఇత‌ర ప‌దార్థాల‌తో క‌లిపి తిన‌రాదు. క‌నీసం 2 గంట‌ల వ్య‌వ‌ధి ఉండాలి. అలాగే వీటిని అధికంగా తింటే అల‌ర్జీలు సంభ‌వించే అవ‌కాశం ఉంటుంది.

Papaya Side Effects important facts to know
Papaya Side Effects

కిడ్నీ స్టోన్ల స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఈ పండ్ల‌ను తిన‌రాదు. డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు తిన‌వ‌చ్చు. శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు, చ‌ర్మ అల‌ర్జీలు ఉన్న‌వారు, ర‌క్తాన్ని ప‌లుచ‌గా చేసే మందుల‌ను వాడేవారు, లో బీపీ ఉన్న‌వారు, గుండెల్లో మంట‌గా ఉంద‌ని అనుకునేవారు బొప్పాయి పండ్ల‌ను తినే విష‌యంలో జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి. డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు వీటిని తినాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.