గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Papaya Paste For Beauty : ఈ పేస్ట్‌ను రాస్తే చాలు, ముఖంపై ఒక్క మ‌చ్చ కూడా ఉండ‌దు.. అందంగా మారుతుంది..!

Papaya Paste For Beauty : ప్రతి ఒక్కరు కూడా అందాన్ని పెంపొందించుకోవడానికి చూస్తూ ఉంటారు. మీరు కూడా మీ అందాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటున్నారా..? నల్లని మచ్చలు, మొటిమలు వంటివి లేకుండా, అందమైన చర్మాన్ని పొందాలనుకునే వాళ్ళు, ఈ…

Papaya Paste For Beauty : ఈ పేస్ట్‌ను రాస్తే చాలు, ముఖంపై ఒక్క మ‌చ్చ కూడా ఉండ‌దు.. అందంగా మారుతుంది..!

Papaya Paste For Beauty : ప్రతి ఒక్కరు కూడా అందాన్ని పెంపొందించుకోవడానికి చూస్తూ ఉంటారు. మీరు కూడా మీ అందాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటున్నారా..? నల్లని మచ్చలు, మొటిమలు వంటివి లేకుండా, అందమైన చర్మాన్ని పొందాలనుకునే వాళ్ళు, ఈ చిట్కా ని పాటించడం మంచిది. చాలామంది మొటిమలు, మచ్చలు ఎక్కువగా ఉన్నాయని, వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. అలా కాకుండా, మనం ఈజీగా ఇంట్లోనే చిట్కాలని పాటించి, అందాన్ని పెంపొందించుకోవచ్చు. పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో, ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. నల్లని మచ్చలు, మొటిమలు కూడా ఈజీగా తొలగిపోతాయి.

ఒక చిన్న టమాట ని శుభ్రంగా కడుక్కోండి. తర్వాత చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోండి. మిక్సీ తీసుకొని, అందులో ఈ ముక్కలు, బొప్పాయి ముక్కలు వేసి, మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్టుని ఒక బౌల్ లో వేసి, ఒక స్పూన్ నిమ్మరసం, అర స్పూన్ పసుపు, రెండు స్పూన్లు కమల పండ్లు తొక్కల పొడి వేసుకోవాలి. అలానే, ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.

Papaya Paste For Beauty how to make this and apply
Papaya Paste For Beauty

దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలా వదిలేసి, తర్వాత శుభ్రమైన నీటితో కడిగేసుకోండి. వారానికి రెండు సార్లు, మీరు ఈ చిట్కాని ఫాలో అవ్వచ్చు. అద్భుతమైన మార్పు వస్తుంది. కావాలంటే ఈ ఇంటి చిట్కాని ఈసారి ట్రై చేయండి. అందంగా ఉండడానికి ఏవేవో క్రీములు రాయక్కర్లేదు.

ఈజీగా మన స్కిన్ ని, మనం ఇంటి చిట్కాలతో మార్చుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ పదార్థాలు అన్నీ కూడా అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. బొప్పాయి, టమాటా లో ఉన్న పోషకాలు మృత కణాలని తొలగిస్తాయి. నల్ల మచ్చలు కూడా వీటి వలన తొలగిపోతాయి. సులభంగా ఇవి మనకి దొరుకుతాయి. పైగా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు చేయక్కర్లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.