OTT : వారం వారం ఓటీటీ యాప్‌లలో కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు సందడి చేస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే ప్రేక్షకులు కూడా ఈ వారం ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ఏయే సిరీస్‌లు స్ట్రీమ్ అవుతున్నాయి.. అని తెలుసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. వారి అభిరుచుల మేరకు ఓటీటీ యాప్‌లు కూడా కొత్త కొత్త మూవీలు, సిరీస్‌లను అందిస్తున్నాయి. ఇక ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగులో తొలిసారిగా మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో ఓటీటీలో వస్తున్న సిరీస్.. అన్యాస్ ట్యుటోరియల్. ఈ సిరీస్ ఆహా ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమ్ కానుంది. జూలై 1 నుంచి దీన్ని ప్రసారం చేయనున్నారు. ఇందులో రెజీనా, నివేదిత సతీష్ ముఖ్య పాత్రల్లో నటించారు.
అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ చిత్రం.. సామ్రాట్ పృథ్వీరాజ్. ఈ మూవీని రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం నిరాశ పరిచింది. ఏకంగా రూ.150 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. అయితే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని జూలై 1వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
కంగనా రనౌత్ నటించిన ధాకడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. అత్యంత భారీ డిజాస్టర్‌గా నిలిచింది. రూ.94 కోట్లు పెట్టి తీస్తే కేవలం రూ.4 కోట్లే వచ్చాయి. అయితే ఈ మూవీకి చాలా రోజుల పాటు ఓటీటీ పార్ట్‌నర్ దొరకలేదు. కానీ ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది. జీ5 యాప్‌లో ఈ సినిమాను జూలై 1వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
హాలీవుడ్ హీరో క్రిస్ ప్రాట్ నటించిన ది టర్మినల్ లిస్ట్ అనే మూవీ కూడా ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. నేవీ సీల్ కమాండర్ పాత్రలో ఆయన నటించారు. ఈ మూవీ కూడా జూలై 1వ తేదీనే రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో దీన్ని చూడవచ్చు. ఇలా పలు సినిమాలు ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…