Tollywood Heroes : సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎవరైనా రాణించాలంటే అందుకు అనేక అంశాలు దోహదపడతాయి. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, డబ్బు ఎంత ఉన్నా సరే లక్ ఉండాలి. అలాగే తీసిన సినిమాలు హిట్ అవ్వాలి. దీంతోపాటు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే తపన ఉండాలి. ఇవన్నీ ఉంటే ఎవరు అయినా సరే హీరోగా రాణిస్తారు. అయితే అభిమానులు హీరోలకు చెందిన ఎత్తు, బరువు, నలుపు, తెలుపు వంటి అంశాలను పట్టించుకోరు. వారికి కావల్సిందల్లా హీరోల యాక్షన్ మాత్రమే. కానీ మన తెలుగు హీరోలకు చెందిన ఎత్తులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వారి హైట్ ఎంత ఉంటుంది ? అన్న వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే..
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ఎత్తు 6 అడుగుల 4 అంగుళాలు కాగా దగ్గుబాటి రానా ఎత్తు 6 అడుగుల 3 అంగుళాలు. ఇక ప్రభాస్, అల్లరి నరేష్ ఇద్దరూ 6 అడుగుల రెండున్నర అంగుళాల ఎత్తు ఉన్నారు. అలాగే మహేష్ బాబు, మంచు విష్ణు, సుమంత్‌లు 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు ఉన్నారు.
ఇక గోపీచంద్, బెల్లంకొండ శ్రీనివాస్, వెంకటేష్‌లు 6 అడుగుల 1 అంగుళం ఎత్తు వరకు ఉన్నారు. రవితేజ, నాగార్జున 6 అడుగులు ఉన్నారు. పవన్ కల్యాణ్, మంచు మనోజ్ 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉన్నారు. వరుణ్ సందేశ్, అఖిల్, నితిన్, శ్రీకాంత్ లు 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్, శర్వానంద్, నిఖిల్, నాగశౌర్యలు 5 అడుగుల 9 అంగుళాలు ఉండగా.. రామ్ చరణ్ 5 అడుగుల ఎనిమిదిన్నర అంగుళాల ఎత్తు ఉన్నారు. కల్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్, నాని, నాగచైతన్యలు 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉన్నారు. రామ్, ఎన్టీఆర్‌లు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉన్నారు.
గమనిక: ఈ సమాచారం మాకు ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇవ్వబడింది. ఇందులో తప్పులకు మాది బాధ్యత కాదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…