గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Orange In Winter : చ‌లికాలంలో నారింజ పండ్ల‌ను రోజూ తినాలి.. ఎందుకంటే..?

Orange In Winter : నారింజ పండ్లు, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నారింజ పండ్లు తింటే, ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. చలికాలంలో, మనకి అనేక రకాల పండ్లు దొరుకుతూ ఉంటాయి. నారింజ పండ్లు కూడా, చలికాలంలో మనకి…

Orange In Winter : చ‌లికాలంలో నారింజ పండ్ల‌ను రోజూ తినాలి.. ఎందుకంటే..?

Orange In Winter : నారింజ పండ్లు, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నారింజ పండ్లు తింటే, ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. చలికాలంలో, మనకి అనేక రకాల పండ్లు దొరుకుతూ ఉంటాయి. నారింజ పండ్లు కూడా, చలికాలంలో మనకి అందుబాటులో ఉంటాయి. నారింజ పండ్లతో ఎన్నో లాభాలు ని పొందవచ్చు. నారింజలో విటమిన్ సి ఉంటుంది. అలానే, విటమిన్ బి, ఫోలేట్ కూడా ఉంటాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలకు నారింజ బాగా ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా నారింజ బాగా ఉపయోగపడుతుంది. నారింజలో పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది.

గుండెకు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. పొటాషియం రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యానికి కూడా నారింజ బాగా ఉపయోగపడుతుంది. నారింజలో విటమిన్ సి, కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం. చర్మాన్ని దృఢంగా ఉంచుతుంది. సాగేటట్టు ఉంచుతుంది. సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడుతుంది. గాయాల్ని కూడా త్వరగా మాన్పిస్తుంది. నారింజ పండ్లను తీసుకుంటే బరువు తగ్గడానికి కూడా అవుతుంది.

Orange In Winter must take these for many benefits
Orange In Winter

నీటి శాతం ఇందులో ఎక్కువ ఉంటుంది. ఇది అదనపు కేలరీలు తీసుకోకుండా, కడుపుని నిండుగా ఉంచుతుంది. నారింజ తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో తెల్ల రక్త కణాలు ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ఈ పండ్లు తీసుకోవడం వలన అంటువ్యాధులు వంటివి రావు.

నారింజ మంచి సిట్రస్ ఫ్రూట్. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ ఉంటాయి. కొలెస్ట్రాల్ వ్యాధితో, బాధపడుతుంటే నారింజ తీసుకోవడం మంచిది. నారింజ ని తీసుకుంటే, చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది. కిడ్నీ సమస్యలు కూడా, నారింజతో తగ్గుతాయి. పుల్లని పండ్లు తింటే చాలా మందికి పడదు. ఎలర్జీ సమస్యలు వస్తాయి. అటువంటి వాళ్ళు ఇటువంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.