NTR Samantha : స‌మంత‌ని ఎన్టీఆర్ అలా అనేశాడేంటి..? కోటి నుండి వెయ్యికి ప‌డిపోయిందా ?

October 10, 2021 1:37 PM

NTR Samantha : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా బుల్లితెరపై సైతం తన హవా కొనసాగిస్తున్నారు.  ముఖ్యంగా ఎవరు మీలో కోటీశ్వరుడు.. ఇక్కడ మనీతో పాటు మనసుల్ని కూడా గెలుచుకోవచ్చు.. లాంటి ప్రోగ్రామ్ తో మరింత సక్సెస్ అవుతున్నారు. లేటెస్ట్ గా ఈ ప్రోగ్రామ్ కి సమంత గెస్ట్ గా రానుంది. నవరాత్రి స్పెషల్ ప్రోమోగా విడుదలైన ఈ షార్ట్ అండ్ స్వీట్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. సమంత, నాగచైతన్యల డైవోర్స్ తర్వాత స్మాల్ స్క్రీన్ పై ఎంటర్ టైన్ చేయబోతోంది.

NTR Samantha  evaru meelo koteeshwarulu video trending

ఈ ప్రోమోలో ఎన్టీఆర్.. సమంతను ఆహ్వానించారు. కూర్చుంటేనే భయంగా ఉందంటూ సామ్ ఎక్స్ ప్రెషన్స్ అద్బుతంగా ఉన్నాయి. ఏది ఏమైనా సామ్ లో ఇంతకు ముందు కనిపించిన జోష్, యాక్టివ్ నెస్‌ అస్సలు లేదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఒక్కసారిగా అందరూ వెయ్యి నుండి కోటి రూపాయలకు వెళ్తుంటే.. నువ్వు మాత్రం కోటి నుండి వెయ్యికి వచ్చావని అన్నారు. దీంతో సమంత.. అయితే నాకు డబ్బులు వద్దు అంటుంది.. వద్దా అని ఎన్టీఆర్ అడగ్గా మళ్ళీ కావాలని అడుగుతుంది. ఫైనల్ గా తన అభిమానుల కోసం బుల్లితెరపై నవరాత్రుల్లో దసరా కానుకగా సందడి చేయనుందని అధికారికంగా ప్రకటించేశారు.

ఇక సమంత విడాకుల నేపథ్యంలో ఆమె తన సోషల్ మీడియోలో చేసే పోస్టులపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది సామ్ దే తప్పంటుంటే మరికొంతమంది విడాకులనేది వారి పర్సనల్ విషయాలని ఆమెకు మద్దతు తెలిపారు. సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. తమిళంలో విజయ్ సేతుపతి, నయనతారలతో పాటుగా కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తోంది. మరికొన్ని సినిమా ప్రాజెక్ట్స్ తో తన కెరీర్ ని ముందుకు సాగించాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఇక తన విడాకుల క్రమంలో ఇన్ స్టాగ్రామ్ లో డైరెక్ట్ గా స్పందించడంతో చాలా వరకు ఈ వివాదం సైలెంట్ అయ్యింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment