Nithya Menon : టాలీవుడ్‌లో మ‌ళ్లీ త‌న హవా చూపిస్తున్న నిత్యా మీన‌న్‌..!

November 1, 2021 11:26 PM

Nithya Menon : ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల ముద్దుగుమ్మ‌ నిత్యా మీనన్‌. ‘ఇష్క్‌’‌ సినిమాతో యూత్‌కు ఫేవరెట్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ‘జబర్దస్త్‌’ చిత్రంతో కాస్త తడబడ్డా నిత్య ‘గుండె జారి గల్లంతయ్యిందే’తో మరోసారి కుర్రకారుల గుండెల్ని కొల్లగొట్టింది. ఈ అమ్మ‌డు ఒక్క తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ సినిమాల్లో తన నటనతో, మధుర గాత్రంతో ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకుంది.

Nithya Menon again getting offers in tollywood

కెరీర్ ఫాంలో ఉన్న స‌మ‌యంలోనే గ్యాప్ తీసుకున్న నిత్యామీన‌న్‌కి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్కింది. ఇటీవ‌ల నిత్యాకి సంబంధించి కొన్ని లుక్స్ విడుద‌ల కాగా, ఇందులో అమ్మ‌డి లుక్స్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాయి. వ‌కీల్ సాబ్ త‌ర్వాత నిత్యాకి వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. నాని నటిస్తోన్న దసరా మూవీలో నిత్యను అతిథి పాత్ర కోసం ఎంపిక చేశారట మేకర్స్.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నిత్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. చిత్రంలో క‌థానాయిక‌గా కీర్తి సురేష్‌ని ఎంపిక చేయ‌గా, ముఖ్య పాత్ర కోసం నిత్యాని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. ఆ పాత్ర ఏంట‌నే దానిపై మాత్రం క్లారిటీ లేదు. గతంలో నాని.. నిత్య మీనన్ కాంబోలో వచ్చిన అలా మొదలైంది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు నానికి నిత్యా సెంటిమెంట్ క‌లసి వ‌స్తుందని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment