Nusrat Jahan : సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో అందులో హీరోయిన్లు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. బుల్లితెర యాంకర్లు, నటీమణులు కూడా అందాల ఆరబోతతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది.. కానీ కొన్ని సార్లు వారు షేర్ చేసే ఫొటోలు వివాదాస్పదం అవుతుంటాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న నటీమణులు గ్లామర్ షో చేస్తే విమర్శలు వస్తున్నాయి. గతంలో నటి రోజాపై కూడా ఇలాగే విమర్శలు వచ్చాయి. అయితే ఆమె ఇప్పుడు ఆ రంగానికి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేసింది. ఇక ఇదే కోవలో ఓ బెంగాల్ ఎంపీకి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
బెంగాల్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తిని గత కొన్నేళ్ల కిందట వివాహం చేసుకుంది. అయితే ఆమె నుదుటన సింధూరం ధరించడంపై అప్పట్లో ఆమెను విమర్శించారు. కానీ కొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇక అలాంటి విమర్శకులకు ఈమె తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ఈమె మళ్లీ వివాదంలో చిక్కుకుంది. బికినీ వేసుకున్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు మళ్లీ తమ నోళ్లకు పనిచెప్పారు.
ఓ బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధివి అయి ఉండి.. సమాజానికి మార్గదర్శకురాలిగా ఉండాలి కానీ.. ఇలా బికినీలు ధరించడం ఏమిటి ? సమజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ? అంటూ.. ఎంపీ నుస్రత్ జహాన్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. అయితే గతంలో తనపై వచ్చిన విమర్శలకు ఈమె దీటుగానే బదులిచ్చింది. కానీ ఈసారి ఎలా స్పందిస్తుందా.. అని వేచి చూస్తున్నారు. మరి ఆమె ఈ విషయంపై ఏమంటుందో చూడాలి.
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…