Manchu Vishnu : మంచు కుటుంబం వారసుడు మంచు విష్ణు ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఆయన నటిస్తున్న గాలి నాగేశ్వర్ రావు అనే సినిమా పబ్లిసిటీ కోసమే ఆయన అలా చేస్తున్నారని అర్థమవుతోంది. ఈ మధ్యే నటి సన్నీ లియోన్‌తో కలిసి మంచు విష్ణు వంట చేశారు. ఆమె వీపు మీద ఆమ్లెట్ వేయబోతున్నట్లు చేశారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. మంచు విష్ణు నటిస్తున్న గాలి నాగేశ్వర్ రావు సినిమాలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పూత్ ఇద్దరూ కీలకపాత్రల్లో నటిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే వీరు ఈ మధ్య కాలంలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.
ఇక తాజాగా మంచు విష్ణు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతో కలిసి సరదాగా గడిపారు. అందులో భాగంగానే మంచు విష్ణును చిత్ర యూనిట్ మీకు సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పూత్‌లలో ఎవరు ఇష్టం అని అడగ్గా.. మొదట పాయల్ రాజ్‌పూత్‌ను చూపించి ఆమె ఇష్టం అని చెప్పారు. తరువాత సన్నీ లియోన్‌ను చూపించి ఆమెనే ఇష్టం అన్నారు. ఇక ఇద్దరినీ పక్క పక్కనే కూర్చోబెట్టి అసలు ఈ ఇద్దరిలో ఎవరు మీకు ఇష్టం అని మరోమారు విష్ణును అడిగారు. దీంతో విష్ణు.. ఇద్దరిలో ఏ ఒక్కరి పేరు చెప్పకుండా.. సడెన్‌గా ఆలియా భట్ అనేశారు. దీంతో విష్ణును సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పూత్ ఇద్దరూ చితకబాదేశారు.
ఇక ఈ ఫన్నీ సంఘటన తాలూకు వీడియోను సన్నీ లియోన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా.. ఆ వీడియో వైరల్ అవుతోంది. కాగా గాలి నాగేశ్వర్ రావు సినిమాకు సంబంధించి ప్రస్తుతం షూటింగ్ పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ పరిసరాల్లో చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్నారు. అందుకనే చాలా రోజుల నుంచి సన్నీ లియోన్ హైదరాబాద్‌లోనే ఉంటోంది. ఇక ఈ మూవీకి ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తుండగా.. అవ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తోంది. అలాగే ఇందులో ఓ పాటను మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ అయ్యే చాన్సులు ఉన్నాయని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…