Manchu Vishnu : మంచు విష్ణును చితకబాదిన సన్నీ లియోన్‌, పాయల్‌ రాజ్‌పూత్‌.. వీడియో..!

May 12, 2022 8:47 PM

Manchu Vishnu : మంచు కుటుంబం వారసుడు మంచు విష్ణు ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఆయన నటిస్తున్న గాలి నాగేశ్వర్‌ రావు అనే సినిమా పబ్లిసిటీ కోసమే ఆయన అలా చేస్తున్నారని అర్థమవుతోంది. ఈ మధ్యే నటి సన్నీ లియోన్‌తో కలిసి మంచు విష్ణు వంట చేశారు. ఆమె వీపు మీద ఆమ్లెట్‌ వేయబోతున్నట్లు చేశారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. మంచు విష్ణు నటిస్తున్న గాలి నాగేశ్వర్‌ రావు సినిమాలో సన్నీ లియోన్‌, పాయల్‌ రాజ్‌పూత్‌ ఇద్దరూ కీలకపాత్రల్లో నటిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే వీరు ఈ మధ్య కాలంలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.

ఇక తాజాగా మంచు విష్ణు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతో కలిసి సరదాగా గడిపారు. అందులో భాగంగానే మంచు విష్ణును చిత్ర యూనిట్‌ మీకు సన్నీ లియోన్‌, పాయల్‌ రాజ్‌పూత్‌లలో ఎవరు ఇష్టం అని అడగ్గా.. మొదట పాయల్‌ రాజ్‌పూత్‌ను చూపించి ఆమె ఇష్టం అని చెప్పారు. తరువాత సన్నీ లియోన్‌ను చూపించి ఆమెనే ఇష్టం అన్నారు. ఇక ఇద్దరినీ పక్క పక్కనే కూర్చోబెట్టి అసలు ఈ ఇద్దరిలో ఎవరు మీకు ఇష్టం అని మరోమారు విష్ణును అడిగారు. దీంతో విష్ణు.. ఇద్దరిలో ఏ ఒక్కరి పేరు చెప్పకుండా.. సడెన్‌గా ఆలియా భట్‌ అనేశారు. దీంతో విష్ణును సన్నీ లియోన్‌, పాయల్‌ రాజ్‌పూత్‌ ఇద్దరూ చితకబాదేశారు.

Manchu Vishnu funny conversation with Payal Rajput
Manchu Vishnu

ఇక ఈ ఫన్నీ సంఘటన తాలూకు వీడియోను సన్నీ లియోన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేయగా.. ఆ వీడియో వైరల్‌ అవుతోంది. కాగా గాలి నాగేశ్వర్‌ రావు సినిమాకు సంబంధించి ప్రస్తుతం షూటింగ్‌ పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ పరిసరాల్లో చిత్ర షూటింగ్‌ నిర్వహిస్తున్నారు. అందుకనే చాలా రోజుల నుంచి సన్నీ లియోన్‌ హైదరాబాద్‌లోనే ఉంటోంది. ఇక ఈ మూవీకి ఈషాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తుండగా.. అవ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ ఈ మూవీని నిర్మిస్తోంది. అలాగే ఇందులో ఓ పాటను మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ అయ్యే చాన్సులు ఉన్నాయని తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now