Theatres : థియేట‌ర్లంటే ప్రేక్ష‌కుల‌కు మొహం మొత్తిందా ? ఆచార్య ప‌రిస్థితే స‌ర్కారు వారి పాట‌కు వ‌చ్చింది..?

Theatres : క‌రోనా పుణ్య‌మా అని ఓ వైపు ఓటీటీ సంస్థ‌లు పండ‌గ చేసుకుంటున్నాయి. గ‌తంలో చాలా సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ అయ్యాయి. దీంతో ప్రేక్ష‌కులు ఇంటి ప‌ట్టునే ఉండి కొత్త కొత్త సినిమాల‌ను ఓటీటీ యాప్‌ల‌లో చూస్తూ ఎంజాయ్ చేశారు. అయితే క‌రోనా ప్ర‌భావం త‌గ్గాక సినిమాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతున్న‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. అవును.. ఈ ప్ర‌భావం ఈ మ‌ధ్య కాలంలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎందుకంటే..

గ‌తంలో చిరంజీవి, మ‌హేష్ బాబు.. వంటి అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయితే అస‌లు మొద‌టి 4 నుంచి 7 రోజుల వ‌ర‌కు ఏ థియేట‌ర్ లోనూ టిక్కెట్లు ల‌భించేవి కావు. అలాగే బుక్ మై షో లాంటి సైట్ లలో టిక్కెట్ల‌ను బుక్ చేస్తుంటే.. ఫాస్ట్ ఫిల్లింగ్ అని వ‌చ్చేది. కానీ మొన్నీ మ‌ధ్య విడుద‌లైన ఆచార్య‌తోపాటు తాజాగా విడుద‌లైన స‌ర్కారు వారి పాట మూవీకి అలాంటి ప‌రిస్థితులు క‌నిపించ‌లేదు. వాస్త‌వానికి ఈ రెండు సినిమాల‌కు తొలి రోజు అనేక థియేట‌ర్ల‌లో టిక్కెట్లు సుల‌భంగానే ల‌భించాయి. చాలా వ‌ర‌కు థియేట‌ర్ల‌లో సీట్లు ఖాళీగానే క‌నిపిస్తున్నాయి. బుక్ మై షో లాంటి యాప్‌ల‌లో చూస్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Theatres

గ‌తంలో అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయిన‌ప్పుడు సినిమా టిక్కెట్ల‌ను బుక్ చేస్తుంటే సీట్లు ఏవీ ఖాళీగా క‌నిపించేవి కావు. కానీ ఇప్పుడు తొలి రోజే సీట్లు ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఆచార్య, సర్కారు వారి పాట ఈ రెండు సినిమాల‌కు ప‌రిస్థితి ఇలాగే ఉంది. తొలి రోజు సుల‌భంగా టిక్కెట్లు దొరుకుతున్నాయి.. అంటే.. మూవీ ఫ్లాప్ అయినా అయి ఉండాలి. లేదంటే.. థియేట‌ర్ల ప‌ట్ల ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తి త‌గ్గి ఉండాలి. అయితే ఆచార్య‌కు ఈ రెండు అంశాల‌ను కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. కానీ స‌ర్కారు వారి పాట అలా కాదు. సినిమా హిట్ టాక్‌నే సొంతం చేసుకుంది. అయిన‌ప్ప‌టికీ థియేట‌ర్ల‌లో సీట్లు ఖాళీగా క‌నిపిస్తున్నాయి.. అంటే థియేట‌ర్లు అంటేనే ప్రేక్ష‌కుల‌కు ఆస‌క్తి త‌గ్గింద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. అంటే.. ప్రేక్ష‌కులు ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

సినిమా విడుద‌ల‌య్యాక నెల రోజుల‌కు.. ఇంకా చెప్పాలంటే.. 3 వారాల్లోనే ఓటీటీలోకి వ‌స్తోంది. క‌నుక కొద్ది రోజులు ఓపిక ప‌డితే చాలు క‌దా.. ఏకంగా ఓటీటీలోనే ఇంట్లో ద‌ర్జాగా టీవీలో చూడ‌వ‌చ్చు.. అని చాలా మంది అనుకుంటున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక థియేట‌ర్ల‌లో సీట్లు ఖాళీగా క‌నిపిస్తుండ‌డానికి ఇంకో కార‌ణం.. టిక్కెట్ల రేట్లు. అవును.. రెండు తెలుగు రాష్ట్రాలు సినిమాల‌కు మొద‌టి వారం ప‌ది రోజుల‌పాటు టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునే వెసులుబాటును క‌ల్పించాయి. దీంతో సాధార‌ణ రోజుల్లో ఉండే ధ‌ర‌ల క‌న్నా.. రిలీజ్ అయిన‌ప్పుడు టిక్కెట్ల ధ‌ర‌లు ప‌న్నుల‌తో క‌లిపి రెట్టింపు అవుతున్నాయి. సాధార‌ణ థియేట‌ర్ల‌లో (సింగిల్ స్క్రీన్) ఒక్క టిక్కెట్ ధ‌ర రూ.200కు పైగానే వ‌సూలు చేస్తుండ‌గా.. మ‌ల్టీ ప్లెక్సుల‌లో ఒక్క టిక్కెట్ ధ‌ర రూ.400కు పైగానే ఉంటోంది. అంటే సింగిల్ థియేట‌ర్ లో న‌లుగురు స‌భ్యులు ఉన్న ఒక కుటుంబం సినిమా చూస్తే రూ.1000కి పైగానే అవుతోంది. క‌నుక‌నే మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన వారు సినిమాకు వెళ్లాలంటే వెనుక‌డుగు వేస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

అయితే సినిమాకు హిట్ టాక్ రావ‌డ‌మో.. లేక ఆర్ఆర్ఆర్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క చిత్ర‌మో అయితే.. ప్రేక్ష‌కులు టిక్కెట్ల‌కు ఎంతైనా ధ‌ర పెట్టి సినిమాలు చూస్తున్నారు. అది ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాల విష‌యంలో రుజువు అయింది. కానీ సాధార‌ణ సినిమాల‌కు టిక్కెట్ల రేట్ల‌ను పెంచితే వెళ్లేందుకు వారు అంత‌గా ఆస‌క్తిని చూపించ‌డం లేదు. ఇది ఆచార్య‌, స‌ర్కారు వారి పాట సినిమాల విష‌యంలో రుజువు అయింది. తొలి రోజు ఈ మూవీల‌కు థియేట‌ర్ల‌లో సీట్లు ఖాళీగా ఉన్నాయంటే.. పైన చెప్పిన ప‌రిస్థితుల‌ను ఒక‌సారి మ‌నం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆచార్య మూవీ ఫ్లాప్ అయింది క‌నుక జ‌నాలు థియేట‌ర్ల‌కు రాలేదు. కానీ స‌ర్కారు వారి పాట‌కు పాజిటివ్ టాక్ అయితే వ‌చ్చింది. మ‌రి తొలి రోజు ఈ మూవీని చూసేందుకు ప్రేక్ష‌కులు రాక‌పోయినా.. పాజిటివ్ టాక్ చూసి.. వారు రానున్న రోజుల్లో అయినా థియేట‌ర్ల‌కు వ‌స్తారా.. లేక ఓటీటీలో చూద్దాంలే అనో.. టిక్కెట్ ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నాయనో.. వెనుక‌డుగు వేస్తారా.. అన్న విష‌యాలు తెలియాల్సి ఉంది. ఇక చివ‌ర‌కు స‌ర్కారు వారి పాట ప‌రిస్థితి ఏమ‌వుతుంది ? ఎన్ని క‌లెక్ష‌న్ల‌ను సాధిస్తుంది ? అన్న వివ‌రాల‌పై కూడా త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. దీంతో అస‌లు ప‌రిస్థితి ఏమిటి ? టిక్కెట్ల రేట్ల‌ను పెంచాలా.. వ‌ద్దా.. అన్న‌దానిపై మ‌ళ్లీ చిత్ర ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు పున‌రాలోచ‌న చేస్తాయా.. అన్న విష‌యం తేలాల్సి ఉంది. అప్ప‌టి వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM