Nusrat Jahan : బికినీ ధరించిన ఎంపీ.. విమర్శిస్తున్న నెటిజన్లు..!

May 12, 2022 6:16 PM

Nusrat Jahan : సోషల్‌ మీడియా అందుబాటులోకి రావడంతో అందులో హీరోయిన్లు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. బుల్లితెర యాంకర్లు, నటీమణులు కూడా అందాల ఆరబోతతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది.. కానీ కొన్ని సార్లు వారు షేర్‌ చేసే ఫొటోలు వివాదాస్పదం అవుతుంటాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న నటీమణులు గ్లామర్ షో చేస్తే విమర్శలు వస్తున్నాయి. గతంలో నటి రోజాపై కూడా ఇలాగే విమర్శలు వచ్చాయి. అయితే ఆమె ఇప్పుడు ఆ రంగానికి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేసింది. ఇక ఇదే కోవలో ఓ బెంగాల్‌ ఎంపీకి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

netizen troll Nusrat Jahan for her latest social media post
Nusrat Jahan

బెంగాల్‌ ఎంపీ, నటి నుస్రత్‌ జహాన్ హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తిని గత కొన్నేళ్ల కిందట వివాహం చేసుకుంది. అయితే ఆమె నుదుటన సింధూరం ధరించడంపై అప్పట్లో ఆమెను విమర్శించారు. కానీ కొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇక అలాంటి విమర్శకులకు ఈమె తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ఈమె మళ్లీ వివాదంలో చిక్కుకుంది. బికినీ వేసుకున్న ఫొటోలను షేర్‌ చేసింది. దీంతో నెటిజన్లు మళ్లీ తమ నోళ్లకు పనిచెప్పారు.

ఓ బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధివి అయి ఉండి.. సమాజానికి మార్గదర్శకురాలిగా ఉండాలి కానీ.. ఇలా బికినీలు ధరించడం ఏమిటి ? సమజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నారు ? అంటూ.. ఎంపీ నుస్రత్‌ జహాన్‌ను నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే గతంలో తనపై వచ్చిన విమర్శలకు ఈమె దీటుగానే బదులిచ్చింది. కానీ ఈసారి ఎలా స్పందిస్తుందా.. అని వేచి చూస్తున్నారు. మరి ఆమె ఈ విషయంపై ఏమంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment