Anushka Shetty : అనుష్క శెట్టి అసలు వివాదాల్లో చిక్కుకోదు. ఆమె అసలు సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. ఈమెకు ఆఫర్లు లేవు. మొన్నా మధ్య వచ్చిన నిశ్శబ్దం మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దీంతో మళ్లీ ఈమె తెరమరుగు అయిపోయింది. అయితే త్వరలోనే నవీన్ పొలిశెట్టితో ఓ మూవీ చేయనుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇతర హీరోయిన్లలా అనుష్క శెట్టి గ్లామర్ ఫొటోలను షేర్ చేయడం లేదు. అసలు తన అప్ డేట్స్ గురించి కూడా ఆమె సోషల్ మీడియాలో ఏమీ పోస్ట్ చేయడం లేదు. కానీ లేటెస్ట్‌గా ఆమె చేసిన పోస్ట్‌కు పాజిటివ్ గా స్పందన రాకపోగా.. నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
అనుష్క శెట్టి ఇటీవలే తన సోదరుడి బర్త్ డే సందర్భంగా ఆయనతో కలసి తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేసింది. అయితే అది ఏమాత్రం క్లారిటీ లేదు. చూస్తుంటే ఆమె తన దగ్గర ఉన్న ఫిజికల్ ఫొటోను స్కాన్ చేసి దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టినట్లు స్పష్టమవుతోంది. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇతర హీరోయిన్లు ఓ వైపు అద్భుతమైన క్లారిటీ కలిగిన ఫొటోలను షేర్ చేస్తుంటే.. నువ్వ ఇలాంటి ఫొటోను పోస్ట్ చేశావేంటి.. అసలు ఎలాంటి ఫొటోలను షేర్ చేయాలో తెలియదా.. అంటూ స్వీటీపై నెటిజన్లు విమర్శలు చేస్తూ.. ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
కాగా అనుష్క శెట్టి 2005లో వచ్చిన సూపర్ సినిమాతో సినీ తెరకు పరిచయం అయింది. అందులో సాషాగా ఆకట్టుకుంది. ఈ మూవీలో నాగార్జునతోపాటు సోనూసూద్, ఆయేషా టకియాలు నటించారు. తరువాత అనేక సినిమాలు చేసింది. కానీ చాలా వరకు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రవితేజతో చేసిన విక్రమార్కుడు, లేడీ ఓరియెంటెడ్ సినిమా అరుంధతి, తమిళంలో సూర్యతో కలసి చేసిన సింగం 2, బాహుబలి, మిర్చి వంటి సినిమాలు ఈమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఈమె చివరిసారిగా 2020లో నిశ్శబ్దం అనే మూవీతో పలకరించింది. తరువాత నుంచి ఖాళీగానే ఉంటోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…