బిగ్ బాస్ లో మోసం.. సామాన్యుడు ఎక్కడ అంటూ ఫైర్ అవుతున్న నెటిజన్లు..

తెలుగు బుల్లితెర చరిత్రలోనే టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. భారీ అంచ‌నాల న‌డుమ సీజ‌న్ 6 తాజాగా మొద‌లైంది. ముందు నుంచే షో నిర్వాహ‌కులు సీజన్ 6 పై అంచ‌నాలు పెంచారు. ఇందులో సెల‌బ్రిటీలతోపాటు సామాన్యులు సైతం పాల్గొంటార‌ని ప్ర‌చారం చేశారు. కానీ తాజా ఎపిసోడ్ చూస్తే సామాన్యుల ఊసే లేదు. తాజాగా ప్ర‌క‌టించిన కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఒక్కరు కూడా సామాన్యుడు లేడు.

కీర్తిభట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చ‌లాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గలాటా గీతు, అభినయ శ్రీ, రోహిత్ సాహ్ని, మరీనా, బాలాదిత్య, వాసంతి క్రిష్ణన్, షాని సాల్మన్, ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫైమా, రాజేశేఖర్, అరోహి రావ్, సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డి. ఇలా హౌస్‌లో 21 మంది సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపారు. యూట్యూబర్‌ ఆది రెడ్డిని కామనర్ అని ఇంట్రడ్యూస్ చేసాడు హోస్ట్ నాగార్జున. ఆ త‌ర్వాత అత‌ను పెద్ద యూట్యూబర్ అని.. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని.. బిగ్ బాస్ రివ్యూలతో పాపులర్ అయ్యారని కూడా స్పెషల్ వీడియో వేసి మరీ చూపించారు.

అంటే ఎంతో కొంత పాపులారిటీ ఉన్న వారిని హౌజ్‌లోకి పంపుతూ ఎంట‌ర్‌టైన్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారే త‌ప్ప‌.. బిగ్ బాస్ సామాన్యులకు అవకాశం కల్పిస్తాం అని చెప్పి.. ఆడిషన్స్ చేసి ఇప్పుడు ఛీటింగ్ చేశారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సామాన్యులకు బంపర్ ఆఫర్ అంటూ నాగార్జున అధికారికంగా మే నెలలో విడుదల చేసిన ప్రోమోను యూట్యూబ్ నుంచి తొలగించారు. దీన్ని బట్టి కావాలనే సామాన్యుడ్ని ఛీట్ చేశారని స్పష్ఠం అవుతోంది. ఎప్ప‌టి మాదిరిగానే ఈ సారి బిగ్ బాస్ హౌజ్ లో వివిధ రంగాల‌కు చెందిన సెలబ్రెటీలు ఉన్నారు. దీనిపై స్టార్ మా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM