Nayanthara : చిరు మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. డైరెక్టర్ మోహన్ రాజా ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాలో చిరంజీవి, నయనతార నటీనటులుగా నటించారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మళయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ను గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు. దీన్ని సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్ బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ లు నిర్మించారు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ లేనప్పటికీ మొదటి నుంచి అందరి దృష్టి కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార పైనే ఉంది. నయన్ ఓ కథను నమ్మి ఒప్పుకుంది అంటే ఆ కథలో ఏదో తెలియని ఓ మెసేజ్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. కానీ గాడ్ ఫాదర్ విషయంలో నయనతార లెక్క తప్పినట్టు తెలుస్తుంది. ఇందులో నయనతార క్యారెక్టర్ పెద్దగా చెప్పుకోదగ్గ విధంగా లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే తన పరిధిలో ఆ పాత్రకు న్యాయం చేసిందని టాక్. నిజానికి మళయాళంలో కథ మొత్తం ఆ అమ్మాయి పైన నడుస్తుంది. కానీ తెలుగులో వచ్చేసరికి మోహన్ రాజా మెగాస్టార్ ని హైలైట్ చేస్తూ నయనతారను తగ్గించేశాడు.
దీంతో నయనతార సినిమాలో నామమాత్రం అయిపోయింది అంటున్నారు. అయితే నయనతార ఈ సినిమా కోసం షాకింగ్ కండిషన్లు పెట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం నయనతార కళ్ళు చెదిరే పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటివరకు టాలీవుడ్ లో ఆమె తీసుకున్న పారితోషకంలో ఇదే హైయెస్ట్ అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం నయనతార ఏకంగా రూ.7 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి సిస్టర్ రోల్ చేసి రూ.7 కోట్లు తీసుకున్న హీరోయిన్ గా నయనతార క్రేజీ రికార్డు క్రియేట్ చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…