Nayanthara : గాడ్ ఫాదర్ మూవీకి నయన‌తార‌ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. టాలీవుడ్ లో ఇదే హైయెస్ట్..!

October 5, 2022 10:40 AM

Nayanthara : చిరు మోస్ట్ అవేటెడ్‌ ఫిల్మ్ గాడ్‌ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. డైరెక్టర్ మోహన్ రాజా ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాలో చిరంజీవి, నయనతార నటీనటులుగా నటించారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మళ‌యాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ను గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు. దీన్ని సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్ బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ లు నిర్మించారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ లేనప్పటికీ మొదటి నుంచి అందరి దృష్టి కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార పైనే ఉంది. నయన్ ఓ కథను నమ్మి ఒప్పుకుంది అంటే ఆ కథలో ఏదో తెలియని ఓ మెసేజ్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. కానీ గాడ్ ఫాదర్ విషయంలో నయనతార లెక్క తప్పినట్టు తెలుస్తుంది. ఇందులో నయనతార క్యారెక్టర్ పెద్దగా చెప్పుకోదగ్గ విధంగా లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే తన పరిధిలో ఆ పాత్రకు న్యాయం చేసిందని టాక్. నిజానికి మళ‌యాళంలో కథ మొత్తం ఆ అమ్మాయి పైన నడుస్తుంది. కానీ తెలుగులో వచ్చేసరికి మోహన్ రాజా మెగాస్టార్ ని హైలైట్ చేస్తూ నయనతారను తగ్గించేశాడు.

Nayanthara took huge remuneration for Godfather movie
Nayanthara

దీంతో నయనతార సినిమాలో నామమాత్రం అయిపోయింది అంటున్నారు. అయితే నయనతార ఈ సినిమా కోసం షాకింగ్ కండిషన్లు పెట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం నయనతార కళ్ళు చెదిరే పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటివరకు టాలీవుడ్ లో ఆమె తీసుకున్న పారితోషకంలో ఇదే హైయెస్ట్ అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం నయనతార ఏకంగా రూ.7 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి సిస్టర్ రోల్ చేసి రూ.7 కోట్లు తీసుకున్న హీరోయిన్ గా నయనతార క్రేజీ రికార్డు క్రియేట్ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now