Nayanthara : సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార ఇక తెలుగు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేయనుందా.. అన్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. లేటెస్ట్ గా నయనతార నార్త్ ఇండియాలో తన పాగా వేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ కి వెళ్ళను అంటూనే తన టాలెంట్ ని బీటౌన్ లో కూడా ప్రజంట్ చేయడానికి చూస్తోంది. నయనతార, చిరుతో కలిసి సైరా సినిమా తర్వాత మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. లేడీ ఒరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.
నయనతార రీసెంట్ గా అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీలోకి ఎంట్రీ ఇచ్చింది. షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో నయనతార పాత్ర స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక బాలీవుడ్ లో కూడా నయనతార మార్క్ ని ప్రజంట్ చేసేలా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నయనతార సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 12 ఏళ్ళు అవుతోంది. రెగ్యూలర్ మూవీస్ లో ఇక యాక్ట్ చేయనంటూ, హీరోయిన్ ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లోనే నటిస్తానంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పేస్తోంది. ఇప్పటికే తమిళ్, మలయాళం లాంటి సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.
ఇక నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమ బంధం పెళ్ళి పీటల వరకు వచ్చింది. ఈ ఏడాది ఆఖరున పెళ్ళి చేసుకుంటారంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. విఘ్నేష్ శివన్ కూడా నయనతార ఫ్యామిలీతో కలిసి పోవడంతో వీరి ప్రేమ కథకు శుభం కార్డ్ పడినట్లే. విఘ్నేష్ డైరెక్షన్ లో వస్తున్న కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో నయనతార మెయిన్ లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తోంది. విజయ్ సేతుపతి, సమంతలు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…