గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Nayanthara : సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న న‌య‌న‌తార‌.. షాక్‌లో ఫ్యాన్స్ !

Nayanthara : సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార ఇక తెలుగు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేయనుందా.. అన్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. లేటెస్ట్ గా నయనతార నార్త్ ఇండియాలో తన పాగా వేసినట్లు…

Nayanthara : సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న న‌య‌న‌తార‌.. షాక్‌లో ఫ్యాన్స్ !

Nayanthara : సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార ఇక తెలుగు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేయనుందా.. అన్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. లేటెస్ట్ గా నయనతార నార్త్ ఇండియాలో తన పాగా వేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ కి వెళ్ళను అంటూనే తన టాలెంట్ ని బీటౌన్ లో కూడా ప్రజంట్ చేయడానికి చూస్తోంది. నయనతార, చిరుతో కలిసి సైరా సినిమా తర్వాత మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. లేడీ ఒరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.

Nayanthara saying good bye to movies entry into bollywood

నయనతార రీసెంట్ గా అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీలోకి ఎంట్రీ ఇచ్చింది. షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో నయనతార పాత్ర స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక బాలీవుడ్‌ లో కూడా నయనతార మార్క్ ని ప్రజంట్ చేసేలా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నయనతార సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 12 ఏళ్ళు అవుతోంది. రెగ్యూలర్ మూవీస్ లో ఇక యాక్ట్ చేయనంటూ, హీరోయిన్ ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లోనే నటిస్తానంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పేస్తోంది. ఇప్పటికే తమిళ్, మలయాళం లాంటి సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

ఇక నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమ బంధం పెళ్ళి పీటల వరకు వచ్చింది. ఈ ఏడాది ఆఖరున పెళ్ళి చేసుకుంటారంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. విఘ్నేష్ శివన్ కూడా నయనతార ఫ్యామిలీతో కలిసి పోవడంతో వీరి ప్రేమ కథకు శుభం కార్డ్ పడినట్లే. విఘ్నేష్ డైరెక్షన్ లో వస్తున్న కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో నయనతార మెయిన్ లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తోంది. విజయ్ సేతుపతి, సమంతలు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి