Nayanthara : నయన తార.. ఏం చేసినా అది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ.. లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళంలోనూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే నయనతార సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలే ఎప్పుడు చర్చనీయాంశంగా ఉండేవి. వీటన్నింటికి తెర దించుతూ ఎట్టకేలకు ఇటీవల నయన్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది. అయితే ఈ జంట ప్రజెంట్ స్పెయిన్ లో సెకండ్ హనీమూన్ ని ఎంజాయ్ చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
సెకండ్ హనీమూన్ ఖర్చులన్నీ ఓ ప్రముఖ సంస్థ భరిస్తుందని. నయనతారకు విగ్నేష్ కు మ్యారేజ్ గిఫ్ట్ గా ఓ సంస్ధ భారీ ఆఫర్ ని ఇచ్చిందని.. వీరి ఒక్క రోజు హోటల్ రూమ్ అద్దె రూ. 2.5 లక్షలని తెలుస్తోంది. ఇతర ఖర్చులు అదనం అని టాక్. ఇప్పటికే వీరి పెళ్లి తతంగాన్ని ఓ ఓటీటీ సంస్థకి ప్రచార హక్కులను అమ్మేసి పెద్ద మొత్తంలోనే సంపాదించినట్లు తెలిసింది. పెళ్లి తరువాత విహార యాత్రల పేరుతో విదేశాలు చుట్టేసి ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వారి రొమాంటిక్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఈ నవ దంపతులు. దీంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అలాగే ప్రజెంట్ నయనతార తన భర్త గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నా కెరియర్ మొదట్లో చాలామంది అబ్బాయిలను చూశాను. నేను కొందరి మనసు అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. కానీ విగ్నేశ్ శివన్ నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడు. నా అందాన్ని కాదు నా మనసుని ఇష్టపడ్డాడు. నన్ను నన్నుగా ప్రేమించాడు. అందుకే మా ఆయన్ని ఎప్పుడు నేను హర్ట్ చేయను. నన్ను అర్థం చేసుకోవడంలో మా ఆయన కింగ్ అంటూ చెప్పుకొచ్చిందట నయన్. దీంతో నయనతార చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఏదిఏమైనా నయన్ వైవాహిక జీవితంలో హ్యాపీగా ఉంటే చాలు అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…