Nayanthara : అందులో మా ఆయన కింగ్.. నయనతార కామెంట్స్ వైరల్..!

August 30, 2022 11:43 AM

Nayanthara : నయన తార.. ఏం చేసినా అది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ.. లేడీ సూప‌ర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళంలోనూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే నయనతార సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలే ఎప్పుడు చర్చనీయాంశంగా ఉండేవి. వీటన్నింటికి తెర దించుతూ ఎట్టకేలకు ఇటీవల నయన్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది. అయితే ఈ జంట ప్రజెంట్ స్పెయిన్ లో సెకండ్ హనీమూన్ ని ఎంజాయ్ చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

సెకండ్ హనీమూన్ ఖర్చులన్నీ ఓ ప్రముఖ సంస్థ‌ భరిస్తుందని. నయనతారకు విగ్నేష్ కు మ్యారేజ్ గిఫ్ట్ గా ఓ సంస్ధ భారీ ఆఫర్ ని ఇచ్చిందని.. వీరి ఒక్క రోజు హోటల్‌ రూమ్‌ అద్దె రూ. 2.5 లక్షలని తెలుస్తోంది. ఇతర ఖర్చులు అదనం అని టాక్‌. ఇప్పటికే వీరి పెళ్లి తతంగాన్ని ఓ ఓటీటీ సంస్థకి ప్రచార హక్కులను అమ్మేసి పెద్ద మొత్తంలోనే సంపాదించినట్లు తెలిసింది. పెళ్లి తరువాత విహార యాత్రల పేరుతో విదేశాలు చుట్టేసి ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కడ వారి రొమాంటిక్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు ఈ నవ దంపతులు. దీంతో అవి నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

Nayanthara comments on Vignesh shivan goes viral
Nayanthara

అలాగే ప్రజెంట్ నయనతార తన భర్త గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నా కెరియర్ మొదట్లో చాలామంది అబ్బాయిలను చూశాను. నేను కొందరి మనసు అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. కానీ విగ్నేశ్ శివన్ నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడు. నా అందాన్ని కాదు నా మనసుని ఇష్టపడ్డాడు. నన్ను నన్నుగా ప్రేమించాడు. అందుకే మా ఆయన్ని ఎప్పుడు నేను హర్ట్ చేయను. నన్ను అర్థం చేసుకోవడంలో మా ఆయన కింగ్ అంటూ చెప్పుకొచ్చిందట నయన్. దీంతో నయనతార చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఏదిఏమైనా నయన్ వైవాహిక జీవితంలో హ్యాపీగా ఉంటే చాలు అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now