Nayanthara : నయనతార – విఘ్నేశ్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. తమకు ఇద్దరు మగ పిల్లలు జన్మించారంటూ ఇటీవలే సోషల్మీడియా ద్వారా తెలిపారు. అయితే దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే వీరికి పెళ్లై ఇంకా 4 నెలలే అవుతోంది. అందులోనూ వీరు సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయ్యారు. దీంతో వారిద్దరిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అలాగే తమకు పిల్లలు ఎలా పుట్టారో వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. నిజంగా సరోగసీ పద్దతిలో నయనతార పిల్లల్ని కన్నట్లైతే వారికి శిక్ష తప్పేలా లేదు.
చట్ట ప్రకారం.. పెళ్ళైన దంపతులు, విడాకులు తీసుకున్న, భర్త చనిపోయిన ఒంటరి మహిళలు సరోగసీ పద్దతిలో పిల్లల్ని కనవచ్చు. నయనతార-విగ్నేష్ 7 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పెళ్ళికి 5 నెలల ముందే సరోగసీని వీరు ఆశ్రయించినట్లు తెలుస్తుంది. సరోగసీ నిబంధనలు నయనతార దంపతులు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సరోగసీ చట్టం 2021 ప్రకారం నయనతార-విగ్నేష్ లకు రూ. 50 వేల జరిమానా, 5 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఈ క్రమంలో నయనతార దంపతులు న్యాయపరమైన సలహాల కోసం లాయర్లను ఆశ్రయిస్తున్నారట.
పెళ్ళైన తర్వాత కూడా సరోగసీ పద్దతిలో పిల్లల్ని కనడానికి నిబంధనలు ఉన్నాయి. భార్యాభర్తలు పిల్లల్ని కనడానికి అనుకూల పరిస్థితులు లేకపోతేనో, ఆరోగ్య కారణాలతోనో వైద్యుల అనుమతితో మాత్రమే సరోగసీని ఆశ్రయించాలి. గతంలో విదేశీయులు అద్దె గర్భం కోసం ఇండియన్ మహిళలను సంప్రదించేవారు. ఇది వ్యాపారంగా మారిపోవడంతో ఇండియన్ గవర్నమెంట్ విదేశీలకు ఇండియాలో సరోగసీ విధానాన్ని రద్దు చేసింది. దీనికి సహకరించిన వైద్యులు, హాస్పిటల్ యాజమాన్యం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. వారు లక్ష రూపాయల ఫైన్, 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…