Nayanthara : గుడిలో ప్ర‌త్య‌క్షం అయిన న‌య‌న‌తార‌ – విగ్నేష్ శివ‌న్ జంట‌.. ఏం జ‌రుగుతోంది ?

April 4, 2022 11:24 AM

Nayanthara : కోలీవుడ్ క్రేజీ కపుల్ న‌య‌న‌తార, విగ్నేష్ శివ‌న్ కొన్నాళ్లుగా తెగ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్నారు. న‌య‌న్‌.. శింబు, ప్ర‌భుదేవాల‌కి బ్రేక‌ప్ చెప్పాక విగ్నేష్ శివ‌న్ ప్రేమ‌లో ప‌డింది. ఇక అప్ప‌టి నుండి అతనితోనే స‌న్నిహితంగా ఉంటూ తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ నయనతార. ప్రస్తుతం నయనతార పలు చిత్రాల్లో నటిస్తోంది. అయితే న‌య‌న‌తార పెళ్లికి సంబంధించి కొన్నాళ్లుగా అనేక వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇటీవ‌ల ఈ జంట సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నార‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. దీనిపై క్లారిటీ ఇవ్వ‌లేదు.

Nayanthara and Vignesh Shivan appeared at temple
Nayanthara

తాజాగా విగ్నేష్ శివన్, నయనతార జంట మైలాపూర్ లోని శ్రీ సాయిరాం టెంపుల్ ని సందర్శించారు. దీంతో గుడి వద్ద జనసందోహంగా మారింది. విగ్నేష్ శివన్, నయనతార ఇద్దరూ చేతిలో పూల మాలలతో కనిపించారు. దీనితో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా కాలంగా ఈ ఇద్ద‌రూ క‌లిసి క‌ట్టుగా పుణ్య క్షేత్రాలు, విహార యాత్ర‌ల‌కు వెళుతున్నారు. వీరిద్ద‌రూ బ‌య‌ట క‌నిపిస్తే చాలు.. అభిమానుల‌కి ఎన్నో అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా నయనతార తన జాతకం ప్రకారం పలు ఆలయాల్లో పూజలు చేయించుకుంటోంద‌ని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ పూజలన్నీ పూర్తయ్యాక విగ్నేష్ శివన్, నయన్ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నయనతార.. విగ్నేష్ శివన్ దర్శకత్వంలోనే కణ్మణి రాంబో ఖతీజా అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మరో హీరోయిన్ గా సమంత నటిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అతి త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ సినిమా రీసెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంది. సెట్‌లో స‌మంత చేసిన సంద‌డికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment