Balakrishna : నంద‌మూరి అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. ఇక‌పై ఓటీటీల్లో బాల‌య్య క‌నిపించ‌నున్నారు ?

October 6, 2021 11:05 AM

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ పేరు చెబితేనే ఫ్యాన్స్‌కు పూన‌కాలు వ‌స్తాయి. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక సినిమా విడుద‌ల రోజు అభిమానులు పండుగ చేసుకుంటారు. అయితే నంద‌మూరి బాల‌కృష్ణ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అది అభిమానుల‌కు గుడ్ న్యూస్ అని చెప్ప‌వ‌చ్చు.

nandamuri balakrishna may appear in ott shows soon

బాల‌కృష్ణ ఓ ఓటీటీ షోలో క‌నిపించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. అందుకు గాను ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఓ స్ట్రీమింగ్ యాప్ సంస్థ‌లో బాల‌య్య మాట్లాడుతున్నార‌ని.. అంతా ఓకే అయితే త్వ‌ర‌లోనే ఆయ‌న స‌ద‌రు స్ట్రీమింగ్ సంస్థ‌కు చెందిన ఓటీటీ షోలో సంద‌డి చేస్తార‌ని తెలుస్తోంది.

ఇక బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ పేరిట ఓ భారీ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ అతిత్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఏది ఏమైనా బాల‌కృష్ణ ఓటీటీల్లో క‌నిపిస్తే మాత్రం ఫ్యాన్స్‌కు సంద‌డిగా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment