గురువారం, జూన్ 11, 2026
వినోదం

Namita Husband : న‌మిత భ‌ర్త‌పై చీటింగ్ కేసు.. అరెస్ట్ త‌ప్ప‌దా..!

Namita Husband : బొద్దుగుమ్మ న‌మిత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చాలా సినిమాల‌లో త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల మ‌న‌సుల‌ని కొల్ల‌గొట్టింది. ముందు హీరోయిన్‌గా న‌టించిన న‌మిత ఆ త‌ర్వాత ఐటెం సాంగ్స్‌లో న‌టించి అద‌ర‌గొట్టింది. ఆమె కొద్ది…

Namita Husband : న‌మిత భ‌ర్త‌పై చీటింగ్ కేసు.. అరెస్ట్ త‌ప్ప‌దా..!

Namita Husband : బొద్దుగుమ్మ న‌మిత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చాలా సినిమాల‌లో త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల మ‌న‌సుల‌ని కొల్ల‌గొట్టింది. ముందు హీరోయిన్‌గా న‌టించిన న‌మిత ఆ త‌ర్వాత ఐటెం సాంగ్స్‌లో న‌టించి అద‌ర‌గొట్టింది. ఆమె కొద్ది సంవ‌త్స‌రాల క్రితం వీరేంద్ర చౌద‌రి అనే వ్య‌క్తిని వివాహం చేసుకుంది. అత‌ను ఇప్పుడు చిక్కుల్లో ప‌డ్డాడు. తమిళనాడు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) కౌన్సిల్‌ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్‌ పదవి ఇప్పిస్తామంటూ గోపాల్‌స్వామి అనే వ్యక్తిని రూ.50 లక్షల మేర మోసం చేసిన కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. విచారణకు హాజరుకావాల్సిందిగా వీరేంద్ర చౌదరితోపాటు మరో ఇద్దరు వ్యక్తులకు కూడా సేలం సెంట్రల్‌ క్రైమ్ బ్రాంచి సమన్లు పంపించిందని సమాచారం.

ముత్తురామన్‌ అనే వ్యక్తి ఛైర్మన్ పదవి ఇప్పిస్తానని అమ్మాపాళయం జాకిర్‌ ప్రాంతానికి చెందిన గోపాల్‌స్వామి వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడు. అయితే ఆ పదవిని వీరేంద్ర చౌదరి ఇటీవలే చేపట్టడంతో గోపాల్‌స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ముత్తురామన్‌తోపాటు కౌల్సిల్ తమిళనాడు డిపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ దుశ్యంత్ యాదవ్‌ను అక్టోబర్ 31న అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా సేలం సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు వీరేంద్ర చౌదరికి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

Namita Husband veerendra chowdary facing problems
Namita Husband

ప్రముఖ నటి, బొద్దుగుమ్మ నమిత తెలుగులో ఆర్యన్‌ రాజేశ్‌ సరసన సొంతం, విక్టరీ వెంకటేశ్‌ సరసన జెమిని, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సరసన బిల్లా తదితర సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళం చిత్రాల్లో నటించిన నమిత ప్ర‌స్తుతం చెన్నైలో నివాసం ఉంటుంది. నమిత బీజేపీ పార్టీలో ఉన్నారు.ఇటీవ‌ల న‌మిత క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌గా, ఈ విష‌యాన్ని త‌మ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం వివాదంలో న‌మిత భ‌ర్త ఉండ‌గా, ఆయ‌న ఎలా బ‌య‌టప‌డ‌తాడో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.