Naga Chaithanya : అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటన చేసినప్పటి నుంచి ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. సమంత సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంది. అయితే సినిమాల పరంగా ఇద్దరూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా ఇటీవలే విడుదల కాగా అది సక్సెస్ సాధించింది. ఈ క్రమంలోనే చైతూ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇక ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ హీరోగా చేస్తున్న లాల్ సింగ్ చద్దా అనే చిత్రంలో ఆంధ్రా కుర్రాడిగా నాగచైతన్య నటిస్తున్నాడు. ఇందులో చైతూ పాత్ర నిడివి 20 నిమిషాలు ఉండనుంది. ఈ మూవీ ఫిబ్రవరి రెండో వారంలో విడుదల కావల్సి ఉండగా.. పలు కారణాల వల్ల విడుదలను ఏప్రిల్‌కు వాయిదా వేశారు. ఇక సోగ్గాడే చిన్ని నాయానా సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తున్న బంగార్రాజు అనే మూవీలోనూ చైతూ నటిస్తున్నాడు.
బంగార్రాజు మూవీలో చైతూకు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని జనవరిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే త్వరలో చైతన్య ఓటీటీలోనూ సందడి చేయనున్నాడు. అందులో భాగంగానే అమెజాన్ ప్రైమ్ రూపొందిస్తున్న ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో చైతూ కనిపించనున్నాడు. ఇందులో చైతూ భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు.
ఇక ఈ సిరీస్‌లో చైతూ విలన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. వెండితెరపై హీరోగా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న చైతూ సిరీస్‌లో మాత్రం నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నాడ. దీంతో ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరోను నెగెటివ్ రోల్‌లో చూడలేమని అంటున్నారు.
హీరోగా బాగానే విజయాలను సాధిస్తున్నప్పటికీ నాగచైతన్య ఇప్పుడు విలన్ రోల్ ఎందుకు చేస్తున్నట్లు ? అని అందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కొత్త ప్రయోగమని, అందువల్ల విచారించాల్సిన పనిలేదని, ఇది కూడా చైతూకు బూస్టింగ్ ఇస్తుందని కొందరు అంటున్నారు. ఇక ఈ సిరీస్‌లో చైతన్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుందని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…