Naga Chaithanya : నాగ‌చైత‌న్య అలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడేంటి ?

December 4, 2021 9:40 PM

Naga Chaithanya : అక్కినేని నాగ‌చైత‌న్య‌, సమంత విడాకుల ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టి నుంచి ఎవ‌రి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. స‌మంత సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంది. అయితే సినిమాల ప‌రంగా ఇద్ద‌రూ బిజీగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే నాగ‌చైత‌న్య న‌టించిన ల‌వ్ స్టోరీ సినిమా ఇటీవ‌లే విడుద‌ల కాగా అది స‌క్సెస్ సాధించింది. ఈ క్ర‌మంలోనే చైతూ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

Naga Chaithanya took that type of decision fans are not satisfied

ఇక ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అమీర్ఖాన్ హీరోగా చేస్తున్న లాల్ సింగ్ చ‌ద్దా అనే చిత్రంలో ఆంధ్రా కుర్రాడిగా నాగ‌చైత‌న్య న‌టిస్తున్నాడు. ఇందులో చైతూ పాత్ర నిడివి 20 నిమిషాలు ఉండ‌నుంది. ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి రెండో వారంలో విడుద‌ల కావ‌ల్సి ఉండ‌గా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల విడుద‌ల‌ను ఏప్రిల్‌కు వాయిదా వేశారు. ఇక సోగ్గాడే చిన్ని నాయానా సినిమాకు ప్రీక్వెల్‌గా వ‌స్తున్న బంగార్రాజు అనే మూవీలోనూ చైతూ న‌టిస్తున్నాడు.

బంగార్రాజు మూవీలో చైతూకు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ మూవీని జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. అయితే త్వ‌ర‌లో చైత‌న్య ఓటీటీలోనూ సంద‌డి చేయ‌నున్నాడు. అందులో భాగంగానే అమెజాన్ ప్రైమ్ రూపొందిస్తున్న ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్‌లో చైతూ క‌నిపించ‌నున్నాడు. ఇందులో చైతూ భిన్న‌మైన పాత్ర‌లో కనిపించ‌నున్నాడు.

ఇక ఈ సిరీస్‌లో చైతూ విల‌న్ పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వెండితెర‌పై హీరోగా స‌క్సెస్ ఫుల్ గా రాణిస్తున్న చైతూ సిరీస్‌లో మాత్రం నెగెటివ్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడ‌. దీంతో ఫ్యాన్స్ అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ అభిమాన హీరోను నెగెటివ్ రోల్‌లో చూడ‌లేమ‌ని అంటున్నారు.

హీరోగా బాగానే విజ‌యాల‌ను సాధిస్తున్న‌ప్ప‌టికీ నాగ‌చైత‌న్య ఇప్పుడు విల‌న్ రోల్ ఎందుకు చేస్తున్న‌ట్లు ? అని అంద‌రూ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇది కొత్త ప్ర‌యోగ‌మ‌ని, అందువ‌ల్ల విచారించాల్సిన ప‌నిలేద‌ని, ఇది కూడా చైతూకు బూస్టింగ్ ఇస్తుంద‌ని కొంద‌రు అంటున్నారు. ఇక ఈ సిరీస్‌లో చైత‌న్య స‌ర‌స‌న ప్రియాంక అరుల్ మోహ‌న్ న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. దీనిపై మ‌రిన్ని వివ‌రాలను త్వ‌ర‌లోనే అధికారికంగా వెల్ల‌డించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now