Naga Chaithanya : న‌న్ను కొట్టు, తిట్టు.. కానీ న‌న్ను విడిచిపెట్టి వెళ్ల‌కు..!

October 3, 2021 10:25 AM

Naga Chaithanya : న‌న్ను కొట్టు, తిట్టు.. కానీ న‌న్ను విడిచిపెట్టి వెళ్ల‌కు..” ఏంటీ.. స‌మంత‌, నాగ చైత‌న్య విడాకులు తీసుకున్నారు క‌దా.. నాగ చైత‌న్య ఈ విధంగా స‌మంత‌ను అడుగుతున్నారా ? అంటే.. అదేమీ లేదు. ఈ డైలాగ్ వారిద్ద‌రూ న‌టించిన మ‌నం సినిమాలోనిది. వారు ఆ మూవీలో పండించిన కెమిస్ట్రీ అంతా ఇంతా కాదు. బెస్ట్ క‌పుల్ అంటే ఇలాగే ఉండాల‌ని ఆ సినిమాలో వారు న‌టించారు.. కాదు.. జీవించారు. కానీ.. క‌ట్ చేస్తే.. నిజ జీవితంలో అది రివ‌ర్స్ అయ్యింది.

Naga Chaithanya : న‌న్ను కొట్టు, తిట్టు.. కానీ న‌న్ను విడిచిపెట్టి వెళ్ల‌కు..!

ల‌వ్ చేస్తే నిజంగానే బ్రేక‌ప్ చెప్పుకోవాలా ? ల‌వ్ అంటే అస‌లు ఏమిటి ? ఒక‌రు చేసిన త‌ప్పుల‌ను ఇంకొక‌రు మ‌నస్ఫూర్తిగా క్ష‌మించాలి. త‌ప్పుల‌ను అంగీక‌రించి సారీ అడ‌గాలి.. త‌రువాత క‌ల‌సి పోవాలి. నిజ‌మైన ప్రేమ అంటే ఇదీ.. దీన్నే మ‌నంలో చూపించారు. కానీ స‌మంత‌, నాగ చైత‌న్య‌లు మాత్రం నిజ జీవితంలో దీన్ని పాటించ‌లేదు. నిజంగానే విడిపోవాల్సినంత వ్య‌వ‌హారం వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిందా ? అంటే.. అది వారే ఆలోచించుకోవాలి.

సినిమాలు క‌ల్పిత‌మే కావచ్చు, కానీ ప్రేమ అన్న‌ది నిజం. అది శాశ్వ‌త‌మైంది. తాత్కాలికం కాదు. స‌రే.. వారి మ‌ధ్య ఏవో గొడ‌వ‌లు వ‌చ్చి విడిపోవాల‌నుకున్నారు, విడిపోయారు.. వాస్త‌వ‌మే. కానీ నిజంగా ఒక‌రినొక‌రు అర్థం చేసుకుని ఉంటే ఇంత వ‌ర‌కు వ‌చ్చేది కాద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. ఏది ఏమైనా వారి విడాకుల విష‌యాన్ని మాత్రం ఫ్యాన్స్ ఇంకా స‌హించ‌లేక‌పోతున్నారన్న‌ది వాస్త‌వం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment