Naga Chaithanya : నాగ‌చైత‌న్య స‌మంత‌కు విడాకులు ఇచ్చేందుకు అమీర్‌ఖానే కార‌ణం.. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన న‌టి..

October 3, 2021 12:20 PM

Naga Chaithanya : స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల వివాహం టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నంగా మారింది. ఇద్ద‌రూ విడాకులు తీసుకోవ‌డంతో వీరి గురించి వ‌స్తున్న రూమ‌ర్ల‌కు ఒక్క‌సారిగా చెక్ పెట్టిన‌ట్లు అయింది. అయితే తెర‌పైకి ఇప్పుడు ఇంకో కొత్త వాదాన వినిపిస్తోంది. అదేమిటంటే..

Naga Chaithanya : నాగ‌చైత‌న్య స‌మంత‌కు విడాకులు ఇచ్చేందుకు అమీర్‌ఖానే కార‌ణం.. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన న‌టి..

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ల‌వ్ స్టోరీ సెల‌బ్రేష‌న్స్‌కు ఇటీవ‌ల బాలీవుడ్ న‌టుడు అమీర్‌ఖాన్ వ‌చ్చారు. అయితే ఆ వేడుక‌ల్లో స‌మంత పాల్గొన‌లేదు. ఈ క్ర‌మంలోనే ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఈ విష‌యంపై బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

అమీర్‌ఖాన్ ఇప్ప‌టికే త‌న భార్యకు విడాకులు ఇచ్చారు. ఆ త‌రువాత అమీర్‌ను నాగ‌చైత‌న్య క‌లిశారు. దీంతో నాగ‌చైత‌న్య విడాకులు ఇచ్చారు. అందువ‌ల్ల నాగ‌చైత‌న్య విడాకులు ఇచ్చేందుకు అమీర్‌ఖాన్ కార‌ణ‌మ‌ని.. కంగ‌నా ఆరోపించింది. ఆమె చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

అమీర్‌ఖాన్‌కు విడాకుల స్పెష‌లిస్ట్‌గా పేరుంద‌ని కంగ‌నా ఆరోపించింది. అత‌ను ఎంతో మంది మ‌హిళ‌లు, పిల్ల‌ల జీవితాల‌తో ఆడుకున్నాడ‌ని పేర్కొంది. ప‌దేళ్లు రిలేష‌న్‌లో ఉండి.. నాలుగేళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉన్న స‌మంత‌, చైత‌న్య విడాకులు తీసుకునేందుకు అమీర్ ఖానే కార‌ణ‌మ‌ని, అత‌ను నాగ చైత‌న్య ఫంక్ష‌న్‌లో పాల్గొన‌డం వ‌ల్లే అత‌ని సూచ‌న మేర‌కు నాగ‌చైత‌న్య స‌మంత‌కు విడాకులు ఇచ్చాడ‌ని ఆరోప‌ణ‌లు చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now