Naga Babu : నాగబాబు మొన్నటి వరకు అజాత శతృవుగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనొక ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు. మెగా ఫ్యామిలీకి, అలాగే రాజకీయాల పరంగా జనసేన పార్టీకి నాగబాబు మాటల తూటా అయ్యారు. ఈ మధ్య కాలంలో ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఏపీ రాజకీయాలపై తరచూ స్పందిస్తున్నారు. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. గతేడాది నుంచి పాలిటిక్స్ ని సీరియస్ గా తీసుకున్న ఆయన అప్పుడప్పుడూ వదులుతున్న కొన్ని ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
మెగా ఫ్యామిలీకి వటవృక్షంలా మారిన చిరంజీవిపై పవన్, నాగబాబు గరం గరంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఆరెంజ్ మూవీ నిర్మాతగా మొత్తం కోల్పోయిన నాగబాబుని చిరంజీవి ఆదుకోలేదనే వాదన ఉంది. పవన్ తనకు ఆర్థిక సహాయం చేసినట్లు నాగబాబు స్వయంగా ఒకటి రెండు సందర్భాల్లో తెలిపాడు. అన్న జీవితం ఇచ్చాడనే కృతజ్ఞతా భావం లోపల ఉన్నప్పటికీ.. ప్రస్తుతం నెగెటివ్ ఫీలింగ్ తమ్ముళ్లలో బలంగా ఉందట.
తమ రాజకీయ ప్రత్యర్థులతో చిరంజీవి సన్నిహితంగా ఉండడం పవన్, నాగబాబులకు అసలు నచ్చడం లేదట. చిరంజీవి జగన్ తో కలిసి కీలక వేదికలపై కూర్చుంటున్నారు. ఇది జనసేన వర్గాలకు నిద్రలేకుండా చేస్తోంది. ఇదిలా ఉండగా గత వారం రోజులుగా నాగబాబు సోషల్ మీడియా పోస్ట్స్ సంచలనం రేపుతున్నాయి. నేను అంత తేలిగ్గా ఎవడినీ వదులుకోను.. వదులుకున్నానంటే వాడికంటే వెధవ ప్రపంచంలో ఉండడు అంటూ ఓ పోస్ట్ చేశారు. ఇది సన్నిహితులను ఉద్దేశించి చేసిన కామెంట్ అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. ఇక తాజా పోస్ట్ లో మరింత ఘాటైన కామెంట్ చేశారు.
మంచి వాడు శత్రువులకు కూడా సాయం చేస్తాడు. చెడ్డవాడు తోడబుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు. మంచి వాళ్ళను దూరం చేసుకుంటే ముంచే వాళ్ళు దగ్గరవుతారని.. ఓ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. జనసేనకు దూరంగా ఉంటున్న చిరంజీవిని ఉద్దేశించే నాగబాబు ఈ కామెంట్ చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాగబాబు పోస్ట్ కింద కామెంట్స్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. అయితే నాగబాబు నిజంగానే చిరంజీవిని ఉద్దేశించి కామెంట్స్ పెట్టారా.. లేక ఇంకెవరినైనా టార్గెట్ చేశారా.. అన్నది తెలియాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…