Naga Babu : చిరంజీవిని నాగ‌బాబు ఏంటి అలా అనేశారు.. అసలు మెగా ఫ్యామిలీలో ఏం జ‌రుగుతోంది ?

August 13, 2022 9:11 PM

Naga Babu : నాగబాబు మొన్నటి వరకు అజాత శతృవుగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనొక ఫైర్‌ బ్రాండ్ గా  మారిపోయారు. మెగా ఫ్యామిలీకి, అలాగే రాజకీయాల పరంగా జనసేన పార్టీకి నాగబాబు మాటల తూటా అయ్యారు. ఈ మధ్య కాలంలో ఆయన సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఏపీ రాజకీయాలపై తరచూ స్పందిస్తున్నారు. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. గతేడాది నుంచి పాలిటిక్స్ ని సీరియస్ గా తీసుకున్న ఆయన అప్పుడప్పుడూ వదులుతున్న కొన్ని ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

మెగా ఫ్యామిలీకి వ‌ట‌వృక్షంలా మారిన చిరంజీవిపై పవన్, నాగబాబు గరం గ‌రంగా ఉన్నార‌నే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక‌ప్పుడు ఆరెంజ్ మూవీ నిర్మాతగా మొత్తం కోల్పోయిన నాగబాబుని చిరంజీవి ఆదుకోలేదనే వాదన ఉంది. పవన్ తనకు ఆర్థిక సహాయం చేసినట్లు నాగబాబు స్వయంగా ఒకటి రెండు సందర్భాల్లో తెలిపాడు. అన్న జీవితం ఇచ్చాడనే కృతజ్ఞతా భావం లోపల ఉన్నప్పటికీ.. ప్రస్తుతం నెగెటివ్ ఫీలింగ్ తమ్ముళ్లలో బలంగా ఉంద‌ట‌.

Naga Babu indirect comments on Chiranjeevi viral in social media
Naga Babu

త‌మ‌ రాజకీయ ప్రత్యర్థులతో చిరంజీవి సన్నిహితంగా ఉండడం పవన్, నాగబాబులకు అసలు నచ్చడం లేద‌ట‌. చిరంజీవి జగన్ తో కలిసి కీలక వేదికలపై కూర్చుంటున్నారు. ఇది జనసేన వర్గాలకు నిద్రలేకుండా చేస్తోంది. ఇదిలా ఉండ‌గా గ‌త వారం రోజులుగా నాగబాబు సోషల్ మీడియా పోస్ట్స్ సంచలనం రేపుతున్నాయి. నేను అంత తేలిగ్గా ఎవడినీ వదులుకోను.. వదులుకున్నానంటే వాడికంటే వెధవ ప్రపంచంలో ఉండడు అంటూ ఓ పోస్ట్ చేశారు. ఇది సన్నిహితులను ఉద్దేశించి చేసిన కామెంట్ అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. ఇక తాజా పోస్ట్ లో మరింత ఘాటైన కామెంట్ చేశారు.

మంచి వాడు శత్రువులకు కూడా సాయం చేస్తాడు. చెడ్డవాడు తోడబుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు. మంచి వాళ్ళను దూరం చేసుకుంటే ముంచే వాళ్ళు దగ్గరవుతారని.. ఓ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. జనసేనకు దూరంగా ఉంటున్న చిరంజీవిని ఉద్దేశించే నాగబాబు ఈ కామెంట్ చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాగబాబు పోస్ట్ కింద కామెంట్స్ చూస్తే ఈ విష‌యం అర్థం అవుతుంది. అయితే నాగబాబు నిజంగానే చిరంజీవిని ఉద్దేశించి కామెంట్స్ పెట్టారా.. లేక ఇంకెవ‌రినైనా టార్గెట్ చేశారా.. అన్న‌ది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now