RRR : లెజండరీ డైరెక్టర్ రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ అఖండ విజయాన్ని సాధించింది. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకుంది. మన సినిమాలకు ఉన్న హద్దులన్నీ చెరిపేసి వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇంకా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైప్పటి నుండి భాషతో సంబంధం లేకుండా ఇప్పటికీ ఎన్నో దేశాలకు చెందిన ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే లేటెస్ట్ గా గూగుల్ తన వెబ్ సైట్ లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి, ఆ సినిమా అభిమానులకి ఒక ఊహించని సర్ ప్రైజ్ ని అందించింది.
ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి గూగుల్ సెర్చ్ లో వెతికినపుడు ఒక బైక్ ఇంకా ఒక గుర్రం ఒక దాని వెంట ఒకటి పరిగెడుతున్నట్టుగా కనిపించేలా ఉన్న యానిమేషన్ ను గూగుల్ తన వెబ్ సైట్ లో పొందుపరిచింది. ఇది ఆర్ఆర్ఆర్ సినిమా అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం తమ ట్విట్టర్ హ్యాండిల్ లో గూగుల్ సెర్చ్ లో ఈ విధంగా మా సినిమాను గౌరవించి మమ్మల్ని ఆశ్చర్యపరిచినందుకు, మా సినిమాకి ఉన్న ప్రజాదరణను, ప్రపంచ వ్యాప్త గుర్తింపుని తెలియజేసినందుకు థాంక్యూ.. అని గూగుల్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఇంకా గూగుల్ లో ఆర్ఆర్ఆర్ సినిమాను సెర్చ్ చేసి ఆ స్క్రీన్ షాట్ కి #RRRTakeOver #RRRMovie అనే హాష్ ట్యాగ్స్ ను జతచేసి తమకి షేర్ చేయాలని కోరారు. కాగా లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకో గుర్తింపుని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో శాటర్న్ అవార్డ్స్ కి 3 విభాగాల్లో ఎంపికైనట్లు సమాచారం. అమెరికాలోని అకాడెమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ అండ్ హార్రర్ ఫిల్మ్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, హార్రర్ లాంటి అంశాలతో రూపొందిన గొప్ప సినిమాలకు ఈ అవార్డ్స్ అందిస్తారు. ఈ ఫలితాలను అక్టోబరు 25న ప్రకటిస్తారని తెలిసింది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…