Chiranjeevi : సీనియర్ నటుడు మురళీ మోహన్ ఈమధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన ఇటీవలే ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సమంత, నాగచైతన్య తమ ఇంటికి సమీపంలోనే ఉండేవారని.. వారు ఉన్న అపార్ట్‌మెంట్‌ను తనదేనని.. గతంలో దాన్ని చైతన్యకు విక్రయించానని తెలిపారు. అయితే ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట ఎందుకు విడిపోయింది అనే విషయం అర్థం కాలేదని.. వారు విడిపోతున్న విషయం తనకు ముందుగానే తెలిసి ఉంటే.. వారికి ఎలాగో సర్దిచెప్పి వారిని కలిపి ఉంచేవాడినని అన్నారు.
ఇక మురళీ మోహన్ చిరంజీవిపై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిపై అప్పట్లో విష ప్రయోగం జరిగిన మాట వాస్తవమేనని అన్నారు. అప్పట్లో మరణమృదంగం సినిమాకు గాను షూటింగ్‌ను చెన్నైలో చేస్తున్నారు. అయితే చిరంజీవి రోజూ షూటింగ్‌లో యథావిధిగా ఒకసారి బయటకు వచ్చి ఫ్యాన్స్‌ను కలిసి మళ్లీ లోపలికి వెళ్తుంటారు. ఇది రోజువారీ దినచర్య. దీంతో ఆయనను చూసేందుకు షూటింగ్‌కు చాలా మంది వచ్చేవారు. అలా ఒక రోజు ఒక వ్యక్తి తన పుట్టిన రోజని చెప్పి చిరంజీవిచే కేక్ కట్ చేయించాడు. తరువాత ఆయన వద్దంటున్నా బలవంతంగా ఆయనకు కేక్‌ను తినిపించాడు. దీంతో ఆయన అయిష్టంగానే కేక్ తిని అక్కడి నుంచి వెంటనే లోపలికి వచ్చేశారు.
అయితే ఆయన పెదవులు నీలం రంగులోకి మారడాన్ని గుర్తించిన షూటింగ్ సిబ్బంది వెంటనే ఆ విషయాన్ని ఆయనకు చెప్పారు. దీంతో ఆయన హుటాహుటిన హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స చేశారు. ఈ క్రమంలోనే రెండు రోజుల అనంతరం ఆయన డిశ్చార్జి అయ్యారు. అయితే ఈ సంఘటన అప్పట్లో తెగ కలకలం రేపింది. చిరంజీవి అప్పట్లో సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయన సక్సెస్‌ను, పేరును చూసి ఓర్వలేకే ఆయనను అంతమొందించేందుకు ఎవరైనా విష ప్రయోగం చేసి ఉండవచ్చని మురళీ మోహన్ తెలిపారు. ఈ క్రమంలోనే మురళీ మోహన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…