Anushka Shetty : టాలీవుడ్‌లో అనుష్క శెట్టి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. ఎన్నో చిత్రాల్లో నటించి హిట్స్‌ను అందుకుంది. అరుంధతి సినిమా ద్వారా లేడీ ఓరియెంటెడ్ మూవీలకు ఈమె ట్రెండ్ సెట్ చేసింది. బాహుబలి ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. అయితే సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క తరువాత దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసింది. కానీ విఫలమైంది. దీంతో ఈమె అప్పటి నుంచి బొద్దుగానే కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. ఈ క్రమంలోనే ఈమె పెళ్లి చేసుకుంటుందనే వార్తలు ప్రస్తుతం హల్‌చల్ చేస్తున్నాయి.
అనుష్క శెట్టి గతంలో ప్రభాస్‌ను ప్రేమించిందని.. అయితే వారి లవ్ ఫెయిల్ అయిందని వార్తలు వచ్చాయి. దీనిపై వారు కూడా స్పందించారు. తాము మంచి ఫ్రెండ్స్ అని.. అంతకు మించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇక గతంలో ఒకసారి నాగచైతన్యకు ఆమెకు వివాహం జరుగుతుందని అన్నారు. దీనిపై నాగార్జున స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఇలా అనుష్క శెట్టి పెళ్లిపై ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మళ్లీ ఆ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆమె ప్రస్తుతం సినిమాలు ఏవీ ఒప్పుకోవడం లేదట. ఒప్పుకున్న సినిమాలు కూడా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు. దీంతో అనుష్క శెట్టి పెళ్లిపై దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలపై క్లారిటీ లేదు.
అనుష్క శెట్టి ఈ మధ్యే తన సినీ వార్షికోత్సవం జరుపుకుంది. సినిమాల్లోకి వచ్చి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసింది. ఇక ఈమె సినీ రంగానికి చెందిన వ్యక్తిని కాకుండా బయటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని.. ఈమె పెళ్లి తప్పక అవుతుందని.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పారు. అలాగే 2023లో ఈమె వివాహం జరుగుతుందన్నారు. దీంతో ఆమెకు పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయని తెలుస్తోంది. అయితే దీనిపై అనుష్క శెట్టి ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…