Anushka Shetty : పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న అనుష్క శెట్టి..? అతి త్వ‌ర‌లోనే వివాహం..?

July 24, 2022 7:52 AM

Anushka Shetty : టాలీవుడ్‌లో అనుష్క శెట్టి ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగింది. ఎన్నో చిత్రాల్లో న‌టించి హిట్స్‌ను అందుకుంది. అరుంధ‌తి సినిమా ద్వారా లేడీ ఓరియెంటెడ్ మూవీల‌కు ఈమె ట్రెండ్ సెట్ చేసింది. బాహుబ‌లి ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. అయితే సైజ్ జీరో సినిమా కోసం భారీగా బ‌రువు పెరిగిన అనుష్క త‌రువాత దాన్ని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేసింది. కానీ విఫ‌ల‌మైంది. దీంతో ఈమె అప్ప‌టి నుంచి బొద్దుగానే క‌నిపిస్తోంది. ఇక ప్ర‌స్తుతం ఈమెకు తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు లేవు. ఈ క్ర‌మంలోనే ఈమె పెళ్లి చేసుకుంటుంద‌నే వార్త‌లు ప్ర‌స్తుతం హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

అనుష్క శెట్టి గ‌తంలో ప్ర‌భాస్‌ను ప్రేమించింద‌ని.. అయితే వారి ల‌వ్ ఫెయిల్ అయింద‌ని వార్త‌లు వచ్చాయి. దీనిపై వారు కూడా స్పందించారు. తాము మంచి ఫ్రెండ్స్ అని.. అంత‌కు మించి తమ మ‌ధ్య ఎలాంటి సంబంధం లేద‌ని తేల్చి చెప్పారు. ఇక గ‌తంలో ఒక‌సారి నాగ‌చైత‌న్య‌కు ఆమెకు వివాహం జ‌రుగుతుంద‌ని అన్నారు. దీనిపై నాగార్జున స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఇలా అనుష్క శెట్టి పెళ్లిపై ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌ళ్లీ ఆ వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఆమె ప్రస్తుతం సినిమాలు ఏవీ ఒప్పుకోవ‌డం లేద‌ట‌. ఒప్పుకున్న సినిమాలు కూడా షూటింగ్ ఎప్పుడు పూర్త‌వుతాయో తెలియ‌దు. దీంతో అనుష్క శెట్టి పెళ్లిపై దృష్టి సారించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఆ వార్త‌ల‌పై క్లారిటీ లేదు.

Anushka Shetty reportedly getting married very soon
Anushka Shetty

అనుష్క శెట్టి ఈ మ‌ధ్యే త‌న సినీ వార్షికోత్స‌వం జ‌రుపుకుంది. సినిమాల్లోకి వ‌చ్చి 17 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా కేక్ క‌ట్ చేసింది. ఇక ఈమె సినీ రంగానికి చెందిన వ్య‌క్తిని కాకుండా బ‌య‌టి వ్య‌క్తిని పెళ్లి చేసుకుంటుంద‌ని.. ఈమె పెళ్లి త‌ప్ప‌క అవుతుంద‌ని.. ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పారు. అలాగే 2023లో ఈమె వివాహం జ‌రుగుతుంద‌న్నారు. దీంతో ఆమెకు పెళ్లి ఘ‌డియ‌లు ద‌గ్గ‌ర ప‌డ్డాయ‌ని తెలుస్తోంది. అయితే దీనిపై అనుష్క శెట్టి ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment