Munugode Bypoll : మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుద‌ల‌.. న‌వంబ‌ర్ 3న పోలింగ్‌, 6న ఫ‌లితాలు..

October 3, 2022 12:13 PM

Munugode Bypoll : మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేయ‌డంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్ప‌డిన విష‌యం విదిత‌మే. అయితే ఆ అసెంబ్లీ సీటుకు గాను ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా విడుద‌ల చేసింది. మునుగోడు స‌హా దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7 అసెంబ్లీ స్థానాల‌కు ఒకేసారి ఉప ఎన్నిక‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 7వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. ఈ మేర‌కు ఎన్నిక‌ల సంఘం ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

న‌వంబ‌ర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుండ‌గా.. 6వ తేదీన ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. నామినేష‌న్లు వేసేందుకు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 14 కాగా.. ఉప‌సంహ‌ర‌ణ‌కు 17వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఇవ్వ‌నున్నారు. ఇక ఇప్ప‌టికే మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన నేత‌లు ప్ర‌చారం మొద‌లు పెట్టేశారు. ఓట‌రు దేవుళ్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు. మ‌ద్యం, మ‌ట‌న్‌, డ‌బ్బు పంపిణీ చేస్తున్నారు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ దావ‌త్‌లు ఇస్తున్నారు.

Munugode Bypoll election schedule released
Munugode Bypoll

మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి గాను ఉప ఎన్నిక‌లో పోటీ చేసేందుకు ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థుల‌ను కూడా ఖరారు చేశారు. తెరాస నుంచి ఇంకా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు. కానీ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డికి టిక్కెట్ వస్తుంద‌ని చెబుతున్నారు. ఇక బీజేపీ నుంచి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్ర‌వంతి రెడ్డి పోటీ చేయ‌నున్నారు. అయితే కోమ‌టిరెడ్డి రాజీనామా చేసిన‌ప్ప‌టి నుంచి ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నోటిఫికేష‌న్ తేదీని చెప్ప‌డంతో ఇక తెలంగాణ‌లో రాజ‌కీయాలు మ‌రింత‌గా వేడెక్క‌నున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now